అనిల్ రావిపూడి మేకింగ్, టేకింగ్, అండ్ రైటింగ్‌తో F 3 సినిమాకి డబుల్ వినోదాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తేజ్‌ల సరసన తమన్నా, మెహ్రీన్‌లు నటిస్తుండగా.. చాదస్తపు అత్తల పాత్రలలో అన్నపూర్ణమ్మ, ప్రగతి కూడా తమ మార్కు నటను ప్రదర్శించబోతున్నారు. వీరి పాత్రలు రెండో భాగంలోనూ కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా ఇదే చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఓ వెరైటీ పోలీస్ పాత్రలో నవ్వించబోతున్నారు. సునీల్ కూడా తనదైన స్టైల్లో కామెడీ పండించబోతున్నాడు. వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ తమ హిలేరియస్ కామెడీతో ట్రైలర్ నిండా సందడి చేశారు. కామెడీ టైమింగ్ లో తిరుగులేని వెంకీ, తెలంగాణ యాసలో అదరగొట్టబోతున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఈ సమ్మర్ మొత్తాన్ని కేప్చర్ చేస్తారని అనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో కొంచెంసేపు ముచ్చటించారు. సరిలేరు నీకెవ్వరు, పటాస్, రాజా ది గ్రేట్ లాంటి సినిమాలు అనిల్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి.
Advertisement
ఎఫ్ 3 (F3) సినిమా ప్రమోషన్ : డైరెక్టర్ అనిల్ రావిపూడి సందడి
Credits:
PINKVILLA
Advertisement
Advertisement
Follow Us