'శాకిని డాకిని' ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రెజీనా కసాండ్రా (Regina Cassandra at Saakini Daakini Promotions)
టాలీవుడ్ కథనాయికలు రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ ప్రధాన పాత్రలలో కొరియన్ పిక్చర్ 'మిడ్నైట్ రన్నర్స్' సినిమాకి రీమేక్‌గా రూపొందిన సినిమా "శాకిని డాకిని" (Saakini Daakini). సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఈ బ్యూటీ.
Photo Credit :
pinkvilla
'శాకిని డాకిని' ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రెజీనా కసాండ్రా (Regina Cassandra at Saakini Daakini Promotions)
"శాకిని డాకిని" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్స్ రెజీనా (Regina cassandra), నివేదా (Nivetha Thomas) ఇద్దరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఓ ప్రమోషన్ ఈవెంట్ లో రెజీనా పెళ్లి గురించి టాపిక్ రాగా ప్రేమ, పెళ్లి అంశాలపై స్పందించింది. ‘‘ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటానో, లేదో కూడా నాకే తెలీదు. అని బదులిచ్చింది.
Photo Credit :
pinkvilla
'శాకిని డాకిని' ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నివేదా థామస్ (Nivetha Thomas at Saakini Daakini Promotions)
తాజాగా "శాకిని డాకిని" థియేట్రికల్ ట్రైలర్ (Saakini Daakini Trailer) ను రిలీజ్ చేశారు మేకర్స్. శిక్షణ కోసం పోలీసు అకాడమీలో చేరిన ఇద్దరమ్మాయిల కథతో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్, డ్రామా, హాస్యం మేళవింపుగా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది.
Photo Credit :
pinkvilla
'శాకిని డాకిని' ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నివేదా థామస్ (Nivetha Thomas at Saakini Daakini Promotions)
కాగా, రెజీనా కసాండ్రా.. టాలీవుడ్ లో 'శివ మనసులో శృతి' (SMS) సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. రెజీనా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో కలిసి 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'పిల్లా నువ్వు లేని జీవితం' లాంటి సినిమాలలో నటించి మంచి క్రేజ్‌ను దక్కించుకుంది.
Photo Credit :
pinkvilla
Follow Us