Advertisement

Nandamuri Balakrishna: ఆహా 'తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్' షోలో సంద‌డి చేసిన నంద‌మూరి బాలకృష్ణ!

Nandamuri Balakrishna:  నందమూరి నటసింహం, సీనియర్ హీరో బాలకృష్ణ సినిమాల్లో హీరోగానే అందరికీ తెలుసు. ఆయన డైలాగు చెప్పినా.. తొడకొట్టినా.. థియేటర్లలో ప్రేక్షకులు చేసే అల్లరి మామూలుగా ఉండదు. అలాంటి బాలయ్య తెలుగు బుల్లితెరపై కనిపిస్తాడని కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి స‌మ‌యంలో బాలయ్య హోస్ట్‌గా మారి ఎంటర్టైన్ చేసిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 

ఇదిలాఉంటే.. ఇప్పుడు బాలయ్య (Nandamuri Balakrishna) మరోసారి బుల్లితెరపై కనిపించడం అభిమానుల‌ను ఖుషీ చేస్తోంది. తెలుగు ఓటీటీ ఆహాలో ఎన్ని షోలు వచ్చినా 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' సాధించినంత సక్సెస్ ఇప్ప‌టివ‌ర‌కు మరే షో సాధించలేకపోయింది. స‌హ‌జంగా తనకు నచ్చని పని చేస్తే బాలయ్య వెంటనే కోప్పడతార‌న్న సంగ‌తి తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ హోస్ట్‌గా ఎలా ఉంటారో చూద్దామని కూడా ఈ షోను రెగ్యులర్‌గా ఫాలో అయినవారు ఉన్నారు. ఇక‌, ఆ క్రేజ్‌తోనే బాల‌య్య‌ అన్‌స్టాపబుల్ షో.. ఐఎమ్‌డీబీలో టాప్ స్థానం దక్కించుకుంది. ఈ షో ఇచ్చిన ఊపుతో ఆహా ఓటీటీలో మరిన్ని కొత్త షోలు ప్రారంభమయ్యాయి. అందులో ఒకటే తెలుగు ఇండియన్ ఐడల్. ఓటీటీలోని పాటల షోలలో మంచి పాపులారిటీ సాధించుకుంది ఈ తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol). ఈ షోకు సంగీత దర్శకుడు ఎస్ఎస్ థ‌మన్, కథానాయిక నిత్యా మీనన్, గాయకుడు కార్తీక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్, సింగ‌ర్ శ్రీరామ చంద్ర ఈ షోను హోస్ట్ చేస్తున్నాడు. 

ఈ ప్రోగ్రామ్ సెమీ ఫైనల్‌కు చేరుకోవడంతో, షో నిర్వాహకులు ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు బాలయ్యను చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను మరింత స్పెషల్‌గా చేశారట బాలయ్య. ఈ షోలో బాలయ్య ఓ అదిరిపోయే సాంగ్‌కు డ్యాన్స్ చేసి స్టేజీపై మంటలు పుట్టించారట. జూన్ 10న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఏదైనా ఆయన దిగనంత వరకే... ఒక్కసారి ఆయన అగుడుపెడితే ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతుంది' అని ఆహా ఓటీటీ పేర్కొంది.

బాలకృష్ణ Nandamuri Balakrishna సినిమాల విష‌యానికి వస్తే... ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో డిఫరెంట్ స్టోరీతో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ఉంటుందని సమాచారం.

Advertisement
You May Also Like These
Advertisement