హీరో గోపీచంద్ (Hero Gopichand)
టాలీవుడ్ లో ఉన్న యాక్షన్ హీరోల్లో గోపీచంద్ (Hero Gopichand) ఒకరు. మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకొని కెరీర్లో దూసుకుపోతున్నాడు ఈ హీరో. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తూన్నాడు. మంచి నటనతో పాటు.. ఆరడుగుల యాక్షన్ కటౌట్ తో మాచో స్టార్ గా పేరు తెచ్చుకున్నారు గోపీచంద్. అలాంటి నటుడు గోపీచంద్ బర్త్ డే (జూన్ 12) నేడు. సీనియర్ డైరెక్టర్ టి.కృష్ణ కొడుకు వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయమైన గోపీచంద్.. మద్రాస్ లోనే పెరిగాడు. అక్కడే పూర్తిగా చదువుకున్నాడు. ఎనిమిది సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన గోపీ.. పై చదువులకోసం రష్యా వెళ్ళాడు. ఆ తర్వాత సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తొలి సినిమాగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో తొలివలపు అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా పెద్ద గా ఆడకపోవడంతో హీరోగా అవకాశాలు రాలేదు.
Photo Credit :
Pinkvilla
హీరో గోపీచంద్ (Hero Gopichand)
ఆ తర్వాత గోపిచంద్ కొన్నాళ్లకు విలన్ గా అవకాశం చేజిక్కించుకున్నాడు. గోపీచంద్ తనలోని నటుడిని నిరూపించుకోవాలనే తపనతో ‘‘జయం’’ (Jayam Movie)మూవీ చేశాడు. ఆ తర్వాత నిజం, వర్షం సినిమాల్లో కూడా పవర్ ఫుల్ విలన్ రోల్స్ చేసి అందరినీ మెప్పించాడు. మూడు సినిమాలు కూడా ఆయనకు మంచి పేరు తెచ్చాయి. నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమా కు బెస్ట్ విలన్ గా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న గోపీచంద్... నిజం, వర్షం సినిమాలకు కూడా బెస్ట్ విలన్ గా మా టీవీ అవార్డ్స్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ హీరోగా ‘‘యజ్ణం’’ సినిమా చేసి హిట్ కొట్టాడు. అయితే, ఈ హీరో అప్పటివరకు విలన్ గా చేసినా కూడా, ఒకే సినిమాతో ప్రేక్షకులను మెప్పించగలిగాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా గోపిచంద్ ను హీరోగా నిలబెట్టింది. ‘యజ్ణం’ తర్వాత గోపిచంద్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ఆంధ్రుడు అంతగా విజయాన్ని అందుకోకపోయినా.. రణం మాత్రం సూపర్ హిట్ అయ్యింది. తనకంటూ స్పెషల్ మ్యానరిజంతో, లుక్స్ తో అభిమానులను ఏర్పరుచుకున్న గోపిచంద్. ఆ తర్వాత ‘రారాజు’అనే మూవీ ఫ్లాప్ అయింది. అయితే వెంటనే క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి తో ‘ఒక్కడున్నాడు’అనే డిఫరెంట్ సబ్జెక్ట్ చేశాడు. ఆ సినిమా కూడా పెద్దగా ఆడకపోయినా.. కొత్త ప్రయత్నం చేశారని ప్రశంసలు దక్కాయి.
Photo Credit :
Pinkvilla
హీరో గోపీచంద్ (Hero Gopichand)
ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న గోపిచంద్ ఈ సారి రూట్ మార్చాడు. అప్పుడప్పుడే ఫేడవుట్ అవుతన్న జగపతిబాబుతో "లక్ష్యం" అనే మల్టీ స్టారర్ చేశాడు. శ్రీవాస్ (Director Shreevas) డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్ అయింది. ఇక్కడే తనకు సున్నా సెంటిమెంట్ వర్కవుట్ అయిందని నమ్మాడు. ముందు నుంచి టైటిల్ లో సున్నా ఉండటం వల్ల ఆ చట్రంలో ఇరుక్కుపోయాడు. అందుకే తర్వాత ప్రతీ సినిమాలో సున్నా ఉండేలా చూసుకున్నాడు. కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. వరుసగా ఒంటరి, శౌర్యం, శంఖం ఫ్లాప్ అయ్యాయి. ఈ దెబ్బతో కాస్త జాగ్రత్త వహించిన గోపిచంద్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో ‘గోలీమార్’ అనే యాక్షన్ సినిమా సెట్ చేశాడు. ఈ సారి ఓ మోస్తారు సక్సెస్ కొట్టాడు. పూరీ రాసిన పవర్ ఫుల్ డైలాగులు గోపిచంద్ కూడా అంతే పవర్ ఫుల్ గా చెప్పడంతో జనాలు కనెక్టయ్యారు.
Photo Credit :
Pinkvilla
హీరో గోపీచంద్ (Hero Gopichand)
‘స్వప్న సంక్రాంతి ముగ్గయితే.. నేను గొబ్బెమ్మను రా’ … ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఒక్కడు’ చిత్రంలో విలన్ ప్రకాశ్ రాజ్ ఎంతో ఇంటెన్సిటీతో ఈ డైలాగ్ చెబుతాడు. ఆ చిత్రంలో ప్రకాష్ రాజ్ (Prakash Raj) క్యారెక్టర్ హైలెట్ అని చెప్పాలి. అయితే మొదట ఈ పాత్రని మన యాక్షన్ హీరో గోపీచంద్ తో చేయించాలి అనుకున్నారట. ఆ సమయంలో కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా గోపీచంద్ విలన్ గా సినిమాలు చేస్తూ వచ్చాడు.
Photo Credit :
Pinkvilla
హీరో గోపీచంద్ (Hero Gopichand)
అప్పటికే ‘జయం’ చిత్రంలో తన విలనిజంతో ప్రశంసలు అందుకున్నాడు. దాంతో ‘ఒక్కడు’ సినిమాలో కూడా గోపీచంద్ ను విలన్ గా తీసుకోవాలి అని భావించారట. అయితే దీనికి హీరో మహేష్ బాబు (Mahesh Babu) అంగీకరించలేదట. ఎందుకంటే… మరోపక్క మహేష్ హీరోగా తేజ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘నిజం’ చిత్రంలో కూడా గోపీచందే విలన్. దాంతో తన రెండు సినిమాల్లోనూ విలన్ ఒక్కరే అయితే బాగోదు అనే ఉద్దేశంతో మహేష్ … గోపీచంద్ ను వద్దన్నాడట. దీంతో ప్రకాష్ రాజ్ ను తీసుకున్నట్టు నిర్మాత యం.ఎస్.రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘గోపీచంద్ లాంటి గొప్ప నటుడిని ‘ఒక్కడు’ వంటి సూపర్ హిట్ సినిమాలో చేయించలేకపోయాను. అందుకే ‘వర్షం’ సినిమాకి తీసుకున్నాను అని’ యం.ఎస్.రాజు తెలిపారు
Photo Credit :
Pinkvilla
Follow Us