మహేష్ బాబు (Mahesh Babu)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన మూవీ 'సర్కారు వారి పాట' (Sarkaruvari paata). వెన్నెల కిషోర్, సముద్రఖని అలాగే మరికొంత మంది ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ 14రీల్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించారు. కాగా, ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్, లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
Photo Credit :
PINKVILLA
కీర్తి సురేష్ (Keerthy Suresh)
ఈ చిత్రంలో మహేష్ బాబు (Mahesh Babu) డిఫరెంట్ మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇక ఇది వరకు విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక కళావతి పాట ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
Photo Credit :
PINKVILLA
మహేష్ బాబు (Mahesh Babu)
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ అందించిన పాటలు ఈ సినిమాపై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యేలా చేశాయి. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ యూసఫ్ గూడలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగ్గా.. దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, వంశీ పైడిపల్లి, గోపీచంద్, మెహర్ రమేష్.. హీరోలు సుధీర్ బాబు, అశోక్ గల్లా అలాగే పలువురు సినీ ప్రముఖులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు.
Photo Credit :
PINKVILLA
మహేష్ బాబుతో హీరో అడవి శేష్ (Mahesh Babu with Adivi Shesh)
కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Mahesh Babu) యూత్‌లోనే కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమా రిలీజయిందంటే చాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కువే. అయితే చాలాకాలం తర్వాత మహేశ్ నుండి వస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా కోసం ఇంతకాలం ఎదురుచూసిన తన అభిమానులు మే 12న థియేటర్లలో చూడబోతున్నారు.
Photo Credit :
PINKVILLA
హీరో సుధీర్ బాబు (Hero Sudheer Babu)
ఇక నిన్న జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా మహేష్ బాబు చేసిన ఒక గొప్ప పని గురించి ఆంధ్ర హాస్పిటల్స్ చైర్మన్, వైద్యుడు రామారావు చెప్పిన విషయం పై ఫ్యాన్స్ ఎంతగానో సంతోషించారు. ఆయన గొప్పతనాన్ని కొనియాడుతూ ఈవెంట్ కు వచ్చిన వారందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. మహేష్ బాబు ఇప్పటి వరకు 2500 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించారని.. ఇదే తరహాలో ఆయన ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని ఆయన వివరణ ఇచ్చారు.
Photo Credit :
PINKVILLA
Follow Us