RRR: జపాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’.. ఆ క్లబ్‌లో చేరిన తొలి భారతీయ సినిమాగా రికార్డు..!

Updated on Nov 28, 2022 11:01 AM IST
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ జపాన్ బాక్సాఫీస్ వద్ద మెస్మరైజింగ్ రన్‌ను కొనసాగిస్తోంది
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ జపాన్ బాక్సాఫీస్ వద్ద మెస్మరైజింగ్ రన్‌ను కొనసాగిస్తోంది

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ ఏడాది ప్రథమార్థంలో రిలీజైన ఈ మూవీ.. సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. సౌత్, నార్త్ అనే తేడాల్లేకుండా విడుదలైన ప్రతి చోట ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఇండియాలో బాక్సాఫీస్ రన్ ముగిసేనాటికి టాప్–3 హయ్యెస్ట్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. 

థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్ట్రీమింగ్ అయ్యింది. ఓటీటీలోనూ ఈ సినిమా పెద్ద హిట్టయ్యింది. వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ లిస్టులో కొన్ని వారాలపాటు  టాప్ ప్లేసులో నిలిచింది. ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రానికి దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్​ నటన, రాజమౌళి మేకింగ్, కీరవాణి మ్యూజిక్‌కు ఫారెన్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. 

కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్​ నటన, రాజమౌళి మేకింగ్, కీరవాణి మ్యూజిక్‌కు ఫారెన్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు

ఇకపోతే, రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ జపాన్‌లో విడుదలైంది. అక్కడ మూవీ ప్రమోషన్స్ కోసం తారక్ (Junior NTR), చెర్రీ (Ram Charan), జక్కన్న వెళ్లిన విషయం విదితమే. పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిన ‘ఆర్ఆర్ఆర్’.. జపాన్‌లోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ చిత్రం జపాన్‌లో అక్టోబర్ 21న విడుదలైంది. అక్కడ 34 రోజుల్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టి 300 మిలియన్ జపాన్ యెన్‌ల క్లబ్‌లో చేరింది. మన కరెన్సీలో చెప్పాలంటే.. దాదాపుగా రూ.18 కోట్లు. ఈ క్లబ్‌లో అత్యంత వేగంగా చేరిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది.

కాగా, ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. యూఎస్‌లోని ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికల్లో ఒకటైన ‘లాస్ ఏంజిల్స్ టైమ్స్’ (Los Angeles Times) పత్రికలో జక్కన్నపై స్పెషల్ ఆర్టికల్ రాశారు. పత్రికలోని ముందు పేజీ పూర్తిగా రాజమౌళి ఆర్టికల్ కనిపిస్తోంది. అందులో జక్కన్నను, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రశంసిస్తూ ఆర్టికల్ రాశారు. ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడికి భారీ అవకాశాలు అంటూ హెడ్‌లైన్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Read more: 'అఖండ' (Akhanda) సినిమాకు త్వరలోనే సీక్వెల్ ఉంటుంది.. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కీలక ప్రకటన!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!