డీజే టిల్లు (DJ Tillu) సీక్వెల్‌పై.. ఫోక‌స్ పెట్టిన‌ సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ (Siddu Jonnalagadda)

Updated on Jun 17, 2022 05:57 PM IST
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా డీజే టిల్లు 2(DJ Tillu 2) తెర‌కెక్కిస్తున్నారు.
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా డీజే టిల్లు 2(DJ Tillu 2) తెర‌కెక్కిస్తున్నారు.

 'డీజే టిల్లు ' (DJ Tillu) సినిమాతో సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ, స‌స్పెన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాగా  'డీజే టిల్లు ' హిట్ సాధించింది. విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది.  'డీజే టిల్లు ' చిత్రానికి సీక్వెల్‌గా డీజే టిల్లు2 తెర‌కెక్కించ‌నున్నార‌ట‌.

అప్పుడెప్పుడో విడుదలైన  'గుంటూరు టాకీస్‌ ' సినిమాలో సిద్ధు న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక ఆ త‌ర్వాత  'డీజే టిల్లు ' మూవీతో సిద్ధు మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక తదుపరి నెక్ట్ సినిమాల‌పై ఈ యంగ్ హీరో స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. 

వ‌రుస ఆఫ‌ర్లు ఉన్నా.. సీక్వెల్‌కే ప్రాధాన్య‌త‌

సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ హైద‌రాబాద్ యాస‌లో  'డీజే టిల్లు ' (DJ Tillu) సినిమాలో అద‌ర‌గొట్టారు. వెరైటీ యాక్టింగ్‌తో యూత్‌ను ఆక‌ర్షించారు. నేహా శెట్టి హీరోయిన్‌గా ఈ చిత్రంలో న‌టించారు. త‌మ‌న్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్ల‌స్ అయింది. 

 'డీజే టిల్లు ' పాట‌తో తమన్ యువ‌త‌ను హుషారెత్తించారు. ఈ చిత్రం విడుదలయ్యాక, వ‌రుస సినిమా ఆఫ‌ర్ల‌తో సిద్ధు ఫుల్ బిజీ అయ్యారు. త‌న స్టార్ డ‌మ్ పెర‌గ‌డంతో సిద్ధు అంత‌కు ముందు ఒప్పుకున్న సినిమాలు చేయ‌డం లేద‌ట‌. త‌న స్ఠార్ ఇమేజ్ త‌గ్గించే క‌థ‌ల‌ను చేయ‌న‌ని ఆయన తేల్చి చెప్పాడట, 

డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా డీజే టిల్లు 2(DJ Tillu 2) తెర‌కెక్కిస్తున్నారు.

డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా  'డీజే టిల్లు 2 ' (DJ Tillu 2) తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ట‌. ఫైన‌ల్ స్కిప్ట్ వ‌ర్క్‌లో సిద్ధు బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లో  'డీజే టిల్లు 2 ' సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు.

సిద్ధు కొత్త చిత్రాన్ని  'సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ' నిర్మిస్తుంది. ఈ చిత్రంలో సిద్ధు గెట‌ప్‌, యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందంటున్నారు అభిమానులు. కొత్త న‌టీన‌టుల‌తో స‌రి కొత్త క‌థ‌తో సిద్ధు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. 

డీజే టిల్లు సీక్వెల్‌పై సిద్ధూ ఏమ‌న్నాడు?
డీజే టిల్లు సినిమా సీక్వెల్‌గా మరో సినిమా తీయాల‌నుకుంటున్నామ‌ని సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ చెప్పారు. డీజే టిల్లు క్యారెక్ట‌ర్‌కు లిమిట్స్ లేవ‌ని.. ఎలా అయినా ఆ పాత్ర‌ను తెర‌కెక్కించ‌వ‌చ్చ‌న్నారు. టిల్లుపై ఎలాంటి క‌థ‌లైనా అల్లుకోవ‌చ్చ‌న్నారు. ప్ర‌స్తుతం  'డీజే టిల్లు' సీక్వెల్ సినిమాకు సంబంధించిన వ‌ర్క్ చేస్తున్నాన‌ని సిద్ధూ జొన్న‌ల‌గడ్డ చెప్పారు. 

Read More: క్రేజ్ త‌గ్గే సినిమాలు చేయ‌నంటున్న డీజే టిల్లు!(Siddhu Jonnalagadda )

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!