Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ముందునుంచి అనుకున్నట్టుగానే హిట్ కొట్టింది. దర్శకుడు పరుశురామ్ డైరెక్షన్‌లో హీరో మహేష్ బాబును కొత్తగా చూపించారు. మాస్ డైలాగులు థియేటర్లలో పేలాయి. ఇక థమన్ మ్యూజిక్‌కు ఫ్యాన్స్ చొక్కాలే చించుకున్నారు.
సినిమా - సర్కారు వారి పాట
హీరో - మహేష్ బాబు
హీరోయిన్ - కీర్తి సురేష్
కథ, దర్శకుడు - పరుశురామ్
సంగీతం - థమన్
పాటల రచయిత - అనంత శ్రీరామ్
నిర్మాతలు -నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
రేటింగ్ - 3.5/5.
కథ ఏంటి?
మహేష్ బాబు మహేష్ అనే క్యారెక్టర్ చేశారు. మహేష్ అమెరికాలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఇచ్చిన డబ్బులకు వడ్డీ కరెక్టుగా వసూలు చేస్తాడు. కళావతి(కీర్తి సురేష్) తన చదువు కోసమని మహేష్ దగ్గర అబద్ధం చెప్పి అప్పు తీసుకుంటుంది. ఆ డబ్బుతో జూదం ఆడుతుందని తెలిసి తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని కళావతిని మహేష్ అడుగుతాడు. తన దగ్గర అంత డబ్బు లేదని .. తన తండ్రి రాజేంద్ర నాథ్(సముద్రఖని) ఇస్తారని కళావతి చెబుతుంది. కళావతికి ఇచ్చిన డబ్బును తిరిగి తీసుకునేందుకు ఇండియా వస్తాడు.
కళావతి తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) విశాఖపట్నంలో పెద్ద వ్యాపారి. రాజ్యసభ ఎంపీ. కళావతికి మహేష్ 10 వేల డాలర్లు అప్పుగా ఇస్తాడు. కానీ కళావతి తండ్రి తన దగ్గర 10 వేల కోట్ల అప్పు తీసుకున్నాడని చెబుతాడు. రాజేంద్రనాథ్ ఎందుకు అన్ని కోట్లు మహేష్‌కు ఇవ్వాలి?. మహేష్ ఇండియాలో నెరవేర్చాలనుకున్న ఆశయం ఏంటనేది సర్కారు వారి పాట సినిమా స్టోరి.
మహేష్ లుక్
మహేష్ బాబును ఇంకా అందంగా చూపించారు. మహేష్ బాబు చాలా స్లిమ్‌గా కూడా కనిపించారు. మేకప్, కాస్టూమ్ సెట్ చేయడానికి డైరెక్టర్ రెండు నెలల టైం తీసుకున్నారట. ఫస్ట్ లుక్ కోసం రెండు నెలల హార్డ్ వర్క్ చేశారట. క్లాస్, మాస్ లుక్‌లో మహేష్ బాబు అదిరిపోయాడని ప్రేక్షకులు అంటున్నారు.
కీర్తి సురేష్ యాక్టింగ్
కీర్తి సురేష్ నట విశ్వరూపం ఏంటో మహానటి సినిమా చూస్తే తెలుస్తుంది. నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి నటనపై మరింత శ్రద్ధ పెట్టారు. చాలా స్లిమ్ అయ్యారు. కామెడీ, ఫన్నీ సీన్లలో కొత్తదనం తెచ్చారు. ఇక కాస్టూమ్స్ విషయంలో ట్రెండ్ సెట్ చేశారు. రు.
దర్శకుడు పరుశురామ్ టాలెంట్
మహేష్ బాబుతో సినిమా తీయాలనుకున్న పరుశురామ్‌కు ముందు నుంచే హిట్ సినిమా తీయాలనే క్లారిటీతో ఉన్నాడు. సర్కారు వారి పాట సినిమా ఓ చాలెంజ్‌గా తీసుకున్నాడట. కోవిడ్ వల్ల లేట్ అయినా కూడా చాలా వెయిట్ చేసి మరీ కథను రాసుకున్నాడు. రాసుకున్న కథకు మించి సినిమా తీశాడు. లవ్, కామెడీ, యాక్షన్‌తో పాటు పొలిటికల్ కంటెంట్ కూడా యాడ్ చేశాడు.
సంగీతం మాస్టారుల సంగతి
అనంత శ్రీరామ్ నాలుగు పస్తకాలను సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా పాట కోసం నింపేశారట. ప్రతీ పాట ప్రేక్షకులకు నచ్చేటట్టు రాయాలని నిర్ణయించుకున్నాడట. కళావతి, పెన్నీ, మ...మ. మహేశా, సర.. సర సర్కారు పాటలు హిట్ టాక్‌తో అనంత శ్రీరామ్ టాలెంట్ మరోసారి తెలిసింది. ఇక సంగీత దర్శకుడు థమన్ సర్కారు వారి పాట హోరెత్తాలని కొత్త మ్యూజిక్ పరికరాలు కొన్నారట. సౌండ్ ఎఫెక్ట్‌తో థియేటర్లు దద్దరిల్లేలా చేశాడు. పాట పాటకు ఆడియన్స్ సీట్లలో నుంచి లేచి డాన్సులు వేసేలా మ్యూజిక్ కంపోజ్ చేశాడు థమన్.
నిర్మాతలు
నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సర్కారు వారి పాట సినిమా నిర్మాతలు. ఖర్చుకు వెనకడుగేయకుండా.. ప్రమోషన్ల జోరు తగ్గకుండా ఈ సినిమాను నిర్మించారు. పాటల ప్రమోషన్లకు కూడా భారీగా ఖర్చు చేశారు. ఇలాంటి ప్రొడ్యూసర్లు నెవర్ బివోర్ అన్నట్లు బడ్జెట్ ఇచ్చారు.
సర్కారు వారి పాట సినిమా హిట్ చేసినందుకు చిత్ర యూనిట్ అందరికీ థాంక్స్ చెప్పింది. అమెరికాలో మిలియన్ డాలర్లును వసూళ్లు చేయడం రికార్డు అని చెప్పారు. రాబోయే రోజుల్లో కలెక్షన్ల పరంగా మంచి రికార్డు సాధిస్తుందని ఆశిస్తున్నాం. ఇండియాలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.
ప్లస్ పాయింట్
మషేష్ లుక్స్
మహేష్ బాబు, కీర్తి సురేష్ కెమిస్ట్రీ
కామెడీ
బ్యాంక్ సీన్స్
మ్యూజిక్
మైనస్ పాయింట్
వన్ మ్యాన్ షో
ఆడియన్స్ టాక్
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ను సమ్మర్ బ్లాక్ బాస్టర్ హిట్ చేశారు. థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు. మహేష్ బాబు నటన బాగుందని మెచ్చుకుంటున్నారు. పాటలు, కథ బాగుందని డిసైడ్ చేశా
Follow Us