Sarkaru Vaari Paata: స‌ర్కారు వారి పాట ర్యాప్ సాంగ్ రిలీజ్

మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. మైత్రీ మూవీస్ స‌ర్కారు వారి పాట సినిమా ర్యాప్ సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.

మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. మైత్రీ మూవీస్ స‌ర్కారు వారి పాట సినిమా ర్యాప్ సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ డైరెక్ష‌న్‌లో రిలీజ్ అయినా ఈ సినిమా ముందు నుంచే మ్యూజికల్ హిట్ సాధించింది. 

కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్, మ.. మ.. మ మహేశా సాంగ్స్ తో స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా హైప్ ను పెంచారు. మ్యూజిక్ ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేసింది. స‌ర్కారు వారి పాట సాంగ్స్ ఎక్క‌డ చూసిన మోత మోగుతున్నాయి.  థ‌మ‌న్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు.  స‌ర్ తీస్తారు తాట అంటూ సాగే ఈ పాట‌ సినిమాలోని కొన్ని సీన్స్ తో ఈ సాంగ్ రిలీజ్ చేశారు. హై వాల్యూమ్ పెట్టుకొని వినండంటూ థ‌మ‌న్ ట్వీట్ చేశారు.

మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)  సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.  ప‌రుశురామ్ పెట్ల ద‌ర్శ‌క‌త్వం ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. స‌ర్కారు వారి పాట సినిమా మొద‌టి రోజు భారీ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల రూపాయలను వ‌సూళ్లు చేసింది 
 

You May Also Like These