స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) మూవీ లైవ్ అప్‌డేట్స్‌

Updated on May 12, 2022 11:19 AM IST
మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాల త‌ర్వాత మహేష్ బాబు చేస్తున్న చిత్రం "స‌ర్కారు వారి పాట".  ఇది ఆయన కెరీర్‌‌కి ఎలాంటి హిట్ ఇస్తుందోన‌ని సినీ వ‌ర్గాల్లో చర్చ నడుస్తోంది.
మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాల త‌ర్వాత మహేష్ బాబు చేస్తున్న చిత్రం "స‌ర్కారు వారి పాట".  ఇది ఆయన కెరీర్‌‌కి ఎలాంటి హిట్ ఇస్తుందోన‌ని సినీ వ‌ర్గాల్లో చర్చ నడుస్తోంది.
స‌ర్కారు వారి పాట హిట్‌పై చిత్ర యూనిట్ లైవ్

Sarkaru Vaari Paata

SarkaruVaariPaata: స‌ర్కారు వారి పాట సినిమా హిట్ చేసినందుకు చిత్ర యూనిట్ అంద‌రికీ థాంక్స్ చెప్పింది. అమెరికాలో మిలియ‌న్ డాల‌ర్లును వ‌సూళ్లు చేయ‌డం రికార్డు అని చెప్పారు. రాబోయే రోజుల్లో క‌లెక్ష‌న్ల ప‌రంగా మంచి రికార్డు సాధిస్తుంద‌ని ఆశిస్తున్నాం. ఇండియాలో కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని చిత్ర ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు తెలిపారు. 

సంగీత ద‌ర్శ‌కులు థ‌మ‌న్ ట్వీట్

SarkaruVaariPaata: మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌ల మ‌ధ్య ల‌వ్ సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయంటూ సంగీత ద‌ర్శ‌కులు థ‌మ‌న్ ట్వీట్ చేశారు. క‌ళావతి, మ‌...మ‌.. మ‌హేశా పాట థియేట‌ర్ల‌ను షేక్ చేస్తుందంటూ అభిమానులు పెట్టిన పోస్టుల‌ను షేర్ చేశారు. థ‌మ‌న్ ట్వీట్స్ స‌ర్కారు వారి పాట సినిమాపై అంచ‌నాల‌ను పెంచెలా ఉన్నాయి. 

మిలియ‌న్ డాల‌ర్ల క‌లెక్ష‌న్‌తో స‌ర్కారు వారి పాట...

SarkaruVaariPaata: అమెరికాలో ఒక మిలియ‌న్ డాల‌ర్ల క‌లెక్ష‌న్‌తో స‌ర్కారు వారి పాట దూసుకెళుతుంది. ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత మొద‌టి రోజు ఇంత‌టి వ‌సూళ్లు సాధించిన సినిమా స‌ర్కారు వారి పాటే. మ‌హేష్ అభిమానులు స‌ర్కారు వారి పాట పాజిటీవ్ టాక్ తెచ్చుకోవ‌డంపై ఆనందంగా ఉన్నారు. 

ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మ‌హేష్ సినిమాపై ట్వీట్

SarkaruVaariPaata: స‌ర్కారు వారి పాట సినిమాకు పొలిటిక‌ల్ లీడ‌ర్స్ నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మ‌హేష్ సినిమాపై ట్వీట్ చేశారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుందన్నారు. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారంటూ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌శంసించారు. 

ఓ అద్భుత‌మైన ఫీలింగ్ క‌లుగుతుంది: డైరెక్ట‌ర్ రాధా

SarkaruVaariPaata: రాధేశ్యామ్ సినిమా డైరెక్ట‌ర్ రాధా కృష్ణ కుమార్ స‌ర్కారు వారి పాట సినిమాపై ట్వీట్ చేశారు. మ‌హేష్ బాబు మాస్ యాక్టింగ్, స్టైలిష్ లుక్ చూస్తుంటే ఓ అద్భుత‌మైన ఫీలింగ్ క‌లుగుతుంద‌న్నారు. థ‌మ‌న్ మ్యూజిక్ మాస్ బీట్ సంగీతం, హై సౌండ్ అదిరిపోయింద‌న్నారు. ఈ సినిమా చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్ తెలిపారు. 

స‌ర్కారు వారి పాట సినిమా రిలీజ్ #SarkaruVaariPaata #SVPMania

Sarkaru Vaari Paata

SarkaruVaariPaata: మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అంటూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ ట్వీట్ చేశారు. మ‌హేష్ బాబు యాక్టింగ్ ఎప్పుడెప్పుడు చూడాలా అని త‌పించిపోతున్నాన‌న్నారు. ఈ సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు దేవీశ్రీ ప్ర‌సాద్. 

SarkaruVaariPaata: సర్కారు వారి పాట సినిమా స‌మ్మ‌ర్ సెన్సేష‌న‌ల్ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అంటూ ట్వీట్ చేసింది. మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌లు జంట‌గా న‌టించిన ఈ సినిమాపై మొద‌టి నుంచి హిట్ టాక్ వ‌చ్చింది. ఎలాంటి రికార్డులు బ్రేక్ చేసిందోన‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు. థియేట‌ర్ల ద‌గ్గ‌ర మ‌హేశా.. అంటూ ఫ్యాన్స్ మోత మోగిస్తున్నారు. 

Sarkaru Vaari Paata

హైద‌రాబాద్‌లో స్పెష‌ల్ షోలు

SarkaruVaariPaata: హీరో మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట సినిమా కొన్ని చోట్ల‌ స్పెష‌ల్ షోలు వేశారు. హైద‌రాబాద్‌లో నాలుగు థియేట‌ర్ల‌లో ఉద‌యం నాలుగు గంట‌ల‌కే స్పెష‌ల్ షో వేశారు. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్ థియేట‌ర్లు,  మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్ల‌లో స‌ర్కారు వారి పాట సినిమా స్పెషల్ షోలు వేశారు. 

తెలంగాణ ప్ర‌భుత్వం వారం రోజుల పాటు స‌ర్కారు వారి పాట సినిమా స్పెష‌ల్ షోల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఉద‌యం ఐదు గంట‌ల నుంచి రాత్రి ఒంటి గంట వ‌ర‌కు ఐదు షోల‌ను ప్ర‌ద‌ర్శించుకోవ‌డానికి ఓకే చెప్పింది. మ‌హేష్ బాబు అభిమానులు తెల్ల‌వారు జాము నుంచే థియేట‌ర్ల ద‌గ్గ‌ర సంద‌డి చేస్తున్నారు. 

Sarkaru Vaari Paata

పైరసీకి కంట్రోల్ చేయ‌డానికి

SarkaruVaariPaata: స‌ర్కారు వారి పాట సినిమా పైరసీకి కంట్రోల్ చేయ‌డానికి నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. యాంటీ పైరసీ కంట్రోల్ రూంని ఏర్పాటు చేశారు. సినిమా పైర‌సీ స‌మాచారం త‌మ‌కు తెల‌పాలంటూ ప్రేక్ష‌కుల‌కు కొన్ని ఫోన్ నంబ‌ర్లు షేర్ చేసింది.  8978650014, 9912425159, 8881108888 నంబ‌ర్ల‌కు కాల్ చేసి పైర‌సీల గురించి కంప్లైంట్ ఇవ్వొచ్చ‌ని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు.

SarkaruVaariPaata: స‌ర్కారు వారి పాట బ్లాక్ బాస్ట‌ర్ అంటూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలోని మ‌.. మ‌.. మ‌హేశా పాట‌కు వ‌చ్చిన రెన్పాన్స్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు. మ‌హేశా పాట‌ను చూస్తూ అభిమానులు చేస్తున్న హంగామాను రీ ట్వీట్ చేశారు. మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ డాన్సుల‌కు ఆడియ‌న్స్ నోట్ల క‌ట్ల‌ల‌ను వెద‌జ‌ల్లుతున్నారు. ఆ వీడియోను ధ‌మ‌న్ షేర్ చేశారు. 

SarkaruVaariPaata: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప‌లో సర్కారు వారి పాట‌కు క్యూ క‌ట్టారు అభిమానులు. అప్స‌ర్ థియేట‌ర్ ఫుల్ క‌లెక్ష‌న్‌తో హౌస్ ఫుల్ అయింది. వర్షాల‌ను లెక్క‌చేయ‌కుండా మ‌హేష్ ఫ్యాన్స్ సర్కారు వారి పాట సినిమా చూసేందుకు వ‌స్తున్నారు. స్టార్ హీరో మ‌హేష్ అంటూ కేరింత‌లు కొడుతున్నారు. 
 

Sarkaru Vaari Paata

SarkaruVaariPaata: స‌ర్కారు వారి పాట సినిమా ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ పెట్ల త‌న ఫ్యామిలీతో క‌లిసి సినిమా చూసేందుకు వెళ్లారు. స‌ర్కారు వారి పాట ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకు పరుశురామ్ త‌న భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి చూశారు. హైద‌రాబాద్‌లో ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ స‌ర్కారు వారి పాట సినిమా చూశారు. ప‌రుశురామ్‌తో పాటు బోయ‌పాటి శ్రీను కూడా ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ ఫోకు వెళ్లారు. 

Sarkaru Vaari Paata: క‌రీంన‌గర్‌లో మ‌హేష్ బాబు అభిమానులు పెద్ద క‌టౌట్ ఏర్పాటు చేశారు. మ‌హేష్ బాబు క‌టౌట్‌కు పాలాబిషేకం చేశారు. రంగురంగుల పూలు, పేప‌ర్లు, నోట్ల‌ను మ‌హేష్ బాబు ఫ్లెక్సీల‌పై విర‌జిమ్మారు. జై మ‌హేష్ బాబు అంటూ సర్కారు వారి పాట సినిమా రిలీజ్‌ను పండుగ‌లా చేసుకుంటున్నారు. 

Sarkaru Vaari Paata:బెంగ‌ళూరులో మ‌హేష్ బాబు ఫ్యాన్స్ థియేట‌ర్ల ద‌గ్గ‌ర ట‌పాసుల మోత మోగించారు. త‌మ ఫేవ‌రెట్ హీరో సినిమా స‌ర్కారు వారి పాట రిలీజ్ కావ‌డంతో అభిమానులు కేరింత‌లు కొడుతూ టపాసులు కాల్చారు. తీన్ మార్ డాన్సులతో ఎంజాయ్ చేశారు. 1000 వాలాల‌తో థియేట‌ర్ల‌ను ద‌ద్ద‌రిల్లించారు.

 

 

Sarkaru Vaari Paata:స‌ర్కారు వారి పాట సినిమా రిలీజ్ కావ‌డంతో మ‌హేష్ అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా హాల్స్ ముందు కేరింత‌లు కొడుతున్నారు. త‌మ హీరోవి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గుమ్మ‌డి కాయ‌ల‌తో దిష్టి తీస్తున్నారు.