హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తక్కువ సినిమాలతోనే స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఈయన నటించిన లేటెస్ట్ సినిమా లైగర్ (Liger) పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తీస్తున్న లైగర్ సినిమా, విడుదలకు ముందే కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది.
విజయ్ దేవరకొండ్‌కు ఇండియా లెవల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ లైగర్ (Liger) సినిమా చేస్తున్నారు. టాలీవుడ్ సినిమాలకు ఉత్తరాదిలో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. హిందీ సినిమాలను మించి కలెక్షన్లను అవి నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో లైగర్ సినిమా కూడా టాలీవుడ్‌తో పాటు, బాలీవుడ్‌లో కూడా వసూళ్లల్లో కొత్త రికార్డులు బద్దలు కొడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం లైగర్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్, ఆడియో రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. లైగర్ ఆడియో హక్కుల కోసం సోనీ కంపెనీ భారీగా ఖర్చుపెట్టింది. సోనీ కంపెనీ దాదాపు రూ.14 కోట్లు చెల్లించిందట.
ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ కెరీర్‌లో, అతి పెద్ద బడ్జెట్‌తో.... అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా లైగరే. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం డిస్నీప్లస్ హాట్‌స్టార్ నిర్మాతలతో డీల్ కుదుర్చుకుంది. అలాగే శాటిలైట్ హక్కులను స్టార్ నెట్‌వర్క్ తీసుకుందట. దీంతో లైగర్ రేంజ్ పెరిగింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైం భారీగా ఖర్చు చేసి డీల్ కుదర్చుకోవడం విశేషం,
లైగర్‌లో బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే విజయ్‌కు జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రంలో విశ్వ విఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ విజయ్ దేవరకొండ తండ్రిగా నటించారనే వార్త వైరల్ అయింది. అందులో, ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఈ క్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్, తన పాన్ ఇండియా సినిమా "లైగర్" కోసం ఇంకా ఎలాంటి సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడో చూడాలి. లైగర్ (Liger) సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
లైగర్ సినిమాను రూ.100 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో లైగర్ సినిమాను విడుదల చేయడం గమనార్హం.
Follow Us