టాలీవుడ్ నటి రష్మిక మందాన ఫ్యాషన్ పద్దతి చాలా సింపుల్‌గా ఉంటుంది.
టాలీవుడ్ నటి రష్మిక మందాన (Rashmika Mandanna) ఫ్యాషన్ పద్దతి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈజీ-బ్రీజీ స్టైల్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో, ఆమెకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉంది. ఇటీవలే రష్మిక మందాన ముంబై విమానాశ్రయంలో మరొక ఫన్ లుక్‌లో కనిపించింది.
Photo Credit :
PINKVILLA
రష్మిక తనకు ఇష్టమైన గూచీ చప్పల్స్‌తో జత చేసిన పూల ఆఫ్-షోల్డర్ దుస్తులను ధరించి సందడి చేసింది.
రష్మిక (Rashmika Mandanna) తనకు ఇష్టమైన గూచీ చప్పల్స్‌తో జత చేసిన, పూల ఆఫ్-షోల్డర్ దుస్తులను ధరించి సందడి చేసింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ 50వ జన్మదినం సందర్భంగా జరిగిన బర్త్ డే బాష్‌కు అటెండ్ కావడం కోసం ఆమె ముంబైకి పయనమైంది.
Photo Credit :
PINKVILLA
గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, పుష్ప లాంటి సినిమాలతో టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన రష్మిక
రష్మిక మందాన ప్రస్తుతం హిందీతో పాటు తెలుగు సినిమాల షూటింగ్లలో కూడా పాల్గొంటూ, యమ బిజీగా తన జీవితాన్ని గడుపుతోంది.
Photo Credit :
PINKVILLA
గీత గోవిందం చిత్రంలోని నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకున్నారు రష్మిక
5 ఏప్రిల్ 1996 తేదిన జన్మించిన రష్మిక మందాన, కిరాక్ పార్టీ అనే ఓ కన్నడ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తొలి చిత్రానికే ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డును అందుకున్నారు. అలాగే గీత గోవిందం చిత్రంలోని నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకున్నారు.
Photo Credit :
PINKVILLA
రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కే యానిమల్ చిత్రంలో కూడా రష్మిక కనిపించనుంది.
రష్మిక బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న 'మిషన్ మజ్ను' చిత్రంతోపాటు, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'గుడ్‌బై' చిత్రానికి కూడా సైన్ చేశారు. అలాగే 'సుల్తాన్' తర్వాత, రష్మిక తన రెండవ తమిళ చిత్రానికి సైన్ చేసింది. ఇందులో దళపతి విజయ్‌తో కలిసి నటిస్తోంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కే యానిమల్ చిత్రంలో కూడా ఆమె కనిపించనుంది.
Photo Credit :
PINKVILLA
Follow Us