దగ్గుబాటి రానా.. లీడర్ సినిమాతో హీరోగా తెలుగులోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. రామానాయుడి మనుమడిగా, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్‌బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. హీరోగానే కాదు విలన్‌గా కూడా తనను తాను నిరూపించుకున్నాడు.
బాహుబలి సినిమాలో తన నటనతో మంచి మార్కులు వేయించుకున్న రానా దగ్గుబాటి (Rana Daggubati).. ప్రస్తుతం సినిమా సమర్పకుడిగా కూడా మారుతున్నాడు. పాన్ ఇండియా మూవీ 777 చార్లి సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నాడు.
‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాతో సినీ ప్రేక్షకులకు దగ్గరైన హీరో రక్షిత్‌శెట్టి. ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ‘777 చార్లి’ సినిమా తెరకెక్కించాడు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది.
చార్లి అనే కుక్క పిల్ల ఇంట్లో నుంచి బయటికి వచ్చి తప్పిపోతుంది. ఈ పరిస్థితుల్లో బయట చార్లి పడిన ఇబ్బందులు ఏమిటి. ధర్మ అనే వ్యక్తిని ఎలా కలుసుకుంది. వారి మధ్య రిలేషన్ ఏంటి. చివరకు ఏం జరిగింది. 777 చార్లి (777 Charlie) అనే అడ్వంచరస్ కామెడీని సినిమా ద్వారా చూపించబోతున్నాడు. జీఎస్ గుప్తాతో కలిసి పరమ్‌వహ్ బ్యానర్‌పై సినిమాను రక్షిత్‌శెట్టి నిర్మిస్తున్నాడు. కిరణ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంగీత శ్రింగేరి, రాజ్ బి.శెట్టి, డానిష్ సెయింట్, బాబీ సింహ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.
తెలుగులో రానా సమర్పకుడిగా రిలీజ్ అవుతున్న 777 చార్లి సినిమాను.. మలయాళంలో నటుడు, నిర్మాత పృధ్వీరాజ్ సుకుమారన్, తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ సమర్పిస్తున్నారు.
Follow Us