తన కుక్కపిల్ల రైమ్‌తో ఆడుకుంటున్న రామ్ చరణ్ (Ram Charan)
రామ్ చరణ్ తన స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ టాక్‌ను కైవసం చేసుకొని, దాదాపు రూ.1000 కోట్ల వరకు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన తదుపరి చిత్రంతో డైరెక్టర్ శంకర్‌తో ఉంటుందని తెలిపారు చెర్రీ. అలాగే రామ్ చరణ్ (Ram Charan) తన తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తున్న ఆచార్య చిత్రం కూడా ఈ నెల 29వ తేదిన విడుదలకు సిద్ధంగా ఉంది.
Photo Credit :
Ram Charan Instagram
మూగజీవాలంటే రామ్ చరణ్‌కు (Ram Charan) కు అమితమైన ప్రేమ
రామ్ చరణ్‌కు కుక్కలంటే ఎంత ఇష్టమో. గుర్రాలంటే కూడా అంతే ఇష్టం. ఆయన వద్ద ప్రత్యేకంగా ట్రైనింగైన గుర్రాలు కూడా ఉన్నాయి. మగధీర సినిమాలో ఓ గుర్రంతో చేసిన యాక్షన్ సన్నివేశం, ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. జంతువులను ఉపయోగించకపోయినప్పటికీ, అటువంటి యాక్షన్ సన్నివేశాలను మనం RRR లో కూడా చూడవచ్చు.
Photo Credit :
Ram Charan Instagram Page
జంతువులను స్నేహితులుగా భావించే రామ్ చరణ్ (Ram Charan)
రామ్ చరణ్ (Ram Charan) తన పెంపుడు జంతువులను తన మిత్రులుగా భావిస్తుంటారు. అప్పుడప్పుడు తనతో పాటు వాటిని షూటింగ్‌లకు కూడా తీసుకెళ్తుంటున్నారు. వాటి ఆలనా పాలనా తానే దగ్గరుండి చూస్తుంటారు. వాటి కోసం ప్రత్యేకమైన సౌకర్యాలను కూడా కలుగుజేస్తుంటారు.
Photo Credit :
Ram Charan Instagram
తన ఆనందాన్ని కుక్కపిల్ల రైమ్‌తో పంచుకుంటున్న రామ్ చరణ్ (Ram Charan)
జంతు ప్రేమికులకు ఓ అరుదైన లక్షణం ఉంటుంది. బాధైనా, సంతోషమైనా.. వారు తమ ఆనందాన్ని తమ పెంపుడు జంతువులతోనే పంచుకుంటూ ఉంటారు. వాటితో ఊసులాడుతారు.. మాట్లాడుతారు.. వాటితో తమ భావోద్వేగాలను కూడా పంచుకుంటూ ఉంటారు. చూశారు కదా.. రామ్ చరణ్ (Ram Charan) తన పెంపుడు కుక్కపిల్ల రైమ్‌తో ఎలా ముచ్చట్లాడుతున్నాడో..!
Photo Credit :
Ram Charan Instagram Page
Follow Us