ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో రామ్ చరణ్ (Ram Charan)
భారత స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకొనే క్రమంలో చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హాజరయ్యారు. రక్షణ శాఖ అధికారులు నిర్వహించిన యుద్ధవీరుల స్మారక కార్యక్రమంలో పాల్గొని అమరులకు నివాళులు అర్పించారు.
Photo Credit :
PINKVILLA
అధికారికి ఆటోగ్రాఫ్ అందిస్తున్న రామ్ చరణ్ (Ram Charan)
ఆజాదీ కా ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో రామ్ చరణ్ (Ram Charan) మాట్లాడుతూ, దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా ఈ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించడం ఆనందాయకమన్నారు. భారతావని 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోవడం, అమరవీరులను స్మరించుకోవడం అందరి అదృష్టమని, ప్రజల జీవనం ప్రశాంతంగా గడుస్తుందంటే, అది దేశ సైనికుల త్యాగఫలితమే అని ఆయన అన్నారు.
Photo Credit :
PINKVILLA
రక్షణ శాఖ అధికారులతో సెల్ఫీ దిగుతున్న రామ్ చరణ్ (Ram Charan)
రక్షణ శాఖ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, సైనికుల ధైర్యసాహసాల గురించిన కథలు వింటుంటే రోమాలు నిక్కబొడుస్తాయని రామ్ చరణ్ (Ram Charan) తన ఉపన్యాసంలో తెలిపారు. మనం నడిచే నేల, పీల్చే గాలి.. వీటి మీద వీరజవాన్ల చెరగని సంతకం ఎప్పటికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Photo Credit :
PINKVILLA
అమర వీరులకు వందనం సమర్పిస్తున్న రామ్ చరణ్ (Ram Charan)
రామ్ చరణ్ (Ram Charan) మాట్లాడుతూ “తమ ప్రాణాలను దేశం కోసం పణంగా పెడుతున్న జవాన్ల త్యాగాన్ని స్మరించుకోవడం అందరి విధి. ” అంటూ యువతో ప్రేరణను నింపే వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రక్షణ శాఖ అధికారులతో సెల్ఫీలు దిగారు.
Photo Credit :
PINKVILLA
విద్యార్థులతో రామ్ చరణ్ (Ram Charan)
అమరవీరుల త్యాగాలను అందరూ గుర్తుపెట్టుకోవాలని రామ్ చరణ్ (Ram Charan) అభిప్రాయపడ్డారు. తాను కూడా ఆర్మీ జవాన్ పాత్రలో నటించానని.. ‘ధృవ’ సినిమాలో అలాంటి పాత్రలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు.
Photo Credit :
PINKVILLA
Follow Us