Advertisement

Tamannaah Bhatia: 'ది లెజెండ్' సినిమా ఆడియో ఫంక్ష‌న్ లో సంద‌డి చేసిన‌ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా

Tamannaah Bhatia : తమిళనాడులో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన న్యూ శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆయన 'లెజెండ్ శరవణన్' గా పిలవబడుతున్నారు. నటన పై ఎంతో ఇష్టంతో తమ బిజినెస్ ప్రమోషన్ అడ్వ‌ర్టైజ్మెంట్ ల‌లో స్టార్ హీరోయిన్లతో కలసి నటిస్తుంటాడు. అప్పట్లో స్టార్ హీరోయిన్ హన్సికతో కలిసి 'లెజెండ్ శరవణ' స్టోర్స్ ప్రకటనలో కనిపించాడు. దీంతో నెటిజ‌న్లు అత‌న్ని బాగా ట్రోల్ చేశారు. 

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ ఇప్పుడు 'ది లెజెండ్' (The Lezend) అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాటు స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నీషియన్స్ తో అగ్ర హీరోల చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా 'ది లెజెండ్' తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా, లక్ష్మీ రాయ్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా న‌టించారు. విల‌క్ష‌ణ న‌టులు ప్రభు, నాజర్, విజయ్ కుమార్, లత, కోవైసరళ, యోగిబాబు వంటి పాపులర్ నటీనటులు ఇందులో ప్ర‌ధాన‌ పాత్రలు పోషించారు. తాజాగా 'ది లెజెండ్' ట్రైలర్ విడుద‌ల‌యింది. యూట్యూబ్ లో ఇప్పటికే 8 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక‌, ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఇస్తున్నట్లు ట్రైలర్ ని బ‌ట్టి చూస్తే అర్థం అవుతోంది. 

ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమా ఆడియో వేడుక ఘ‌నంగా జరిగింది. కాగా, ఈ వేడుక‌కు పది మంది హీరోయిన్లు హాజరు కావడం విశేషం. అగ్ర‌హీరోయిన్లు పూజా హెగ్డే, తమన్నా భాటియా (Tamannaah Bhatia) హాజ‌ర‌య్యారు. ఇక వీరితో పాటు ఈ సినిమాలో న‌టించిన‌ ఊర్వశి రౌటేలా, లక్ష్మీ రాయ్ కూడా హాజ‌రై సందడి చేశారు. హన్సిక, శ్రీలీల, శ్రద్ధా శ్రీనాథ్, డింపుల్ హయతి, యాషికా ఆనంద్, నూపూర్ సనన్ వంటి హీరోయిన్లు లెజెండ్ శరవణన్ సినిమా ఫంక్షన్ కు హాజరు కావ‌డం విశేషం. అయితే, స్టార్ హీరోలు కూడా వారి సినిమాల‌కు చేయలేని ప్రమోషన్ ఇది. అయితే శరవణన్ ప్రతి హీరోయిన్ కు చార్టర్డ్ ఫ్లైట్ టిక్కెట్ తో పాటు పారితోషికం కూడా ఇచ్చి ఈ ఫంక్ష‌న్ కు తీసుకు వచ్చాడనే టాక్ న‌డుస్తోంది. శరవణన్ త‌న సినిమా కోసం డబ్బును నీళ్లలా కుమ్మరించాడని తెలుస్తోంది. త‌న‌ డెబ్యూ మూవీతోనే స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని ఆయ‌న‌ భావిస్తున్నారు. 

Advertisement
You May Also Like These
Advertisement