Konidela Production: ఆచార్య రిజల్ట్ కొణిదెల ప్రొడక్షన్స్‌పై ఎఫెక్ట్ పడింది. కొణిదెల ప్రొడక్షన్ మైసేయండని డిమాండ్ చేస్తున్నారు. హిట్ ఇవ్వనందుకు ఇక కొణిదెల ప్రొడక్షన్‌ను మూసేస్తారా?
కొణిదెల ప్రొడక్షన్(Konidela Production)లో మెగా ఫ్యామిలీకి పార్ట్‌నర్ షిప్ ఉంది. చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలిసి నటించిన సినిమా ఆచార్య ఫ్లాప్‌తో మెగా అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. నెగెటీవ్ టాక్ కారణంగా ఆచార్య సినిమా చూసేందుకు ఆడియన్స్ చాలా తక్కువ మంది థియేట్లకు వెళ్తున్నారు. చిరంజీవి ప్లాప్ సినిమా కలెక్షన్లు వేరే హీరోల హిట్ సినిమా వసూళ్లు సమానంగా ఉండేవని అప్పట్లో అనేవారు. ప్రస్తుతం ఆ సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తుంది.
మెగా ఫ్యామిలీకి సొంత నిర్మాణ సంస్థ సినిమాలు కలిసిరావని అంటుంటారు అంజనా ప్రొడక్షన్స్ నిర్మించిన రుద్రవీణ, త్రినేత్రుడు అనుకున్న కలెక్షన్ రాలేదు. ముగ్గురు మొనగాళ్లు కూడా అంతే. బావగారు బాగున్నారా ఒక్కటే హిట్టు కొట్టింది. ఇక ఆరంజ్ సినిమా అయితే అట్టర్ ప్లాప్ అయింది. రామ్ చరణ్ హీరోగా నాగబాబు నిర్మాతగా తీసిన సినిమా ఆరంజ్. ఆరంజ్ నష్టాలతో నాగబాబుకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కొణిదెల ప్రొడక్షన్‌ను రామ్ చరణ్ సరిగ్గా హ్యాండీల్ చేయలేకపోతున్నారనే టాక్ నడుస్తుంది.
కొణిదెల ప్రొడక్షన్(Konidela Production)లో వచ్చిన ఖైదీ నెంబర్ 150 కమర్షియల్ సక్సెస్ సాధించినా.. ప్రమోషన్స్‌లో ఫెయిల్ అయింది. సైరా నరసింహారెడ్డి కూడా నష్టమే మిగిల్చింది. చాలా టైం తీసుకుని ఆచార్చ నిర్మిస్తే.. అది కాస్త హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇక కొణిదెల ప్రొడక్షన్ మూసేయాలని మెగా అభిమానులు కోరుతున్నారు. నిర్మాతలుగా ఫెయిల్ అనిపించుకోవడం కన్నా హీరోగా హిట్ అనిపించుకోవడం బెటర్ రామ్ చరణ్ అని పోస్టులు పెడుతున్నారు
Follow Us