Sarakaruvari Paata: అమెరికా బాక్సాఫీసుల‌ను బ‌ద్ద‌లు కొడుతున్న స‌ర్కారు వారి పాట‌

Sarakaruvari Paata: స‌ర్కారు వారి పాట సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2.2 మిలియన్ గ్రాస్ రీచ్ అయింద‌ని అధికారికంగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 

Sarakaruvari Paata: స‌ర్కారు వారి పాట సినిమా అమెరికాలో కేక పుట్టిస్తుంది. థియేట‌ర్ల‌ను షేక్ చేస్తూ కోట్ల‌ను కొల్ల‌గొడుతుంది. మ‌హేష్ బాబు (Mahesh Babu), కీర్తి సురేష్‌లు న‌ట‌నను అమెరిక‌న్స్ ఎంజాయ్ చేస్తున్నారు. స‌ర్కారు వారి పాట విడుద‌లైన తొమ్మిది రోజుల్లో 99.65 కోట్ల షేర్‌ను సాధించింది. ప‌రుశురామ్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా అమెరికాలో మిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూళ్లు చేస్తుంది.  యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2.2 మిలియన్ గ్రాస్ రీచ్ అయింద‌ని అధికారికంగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 

ప్రస్తుతం వ‌రుస విజ‌యాల‌తో మ‌హేష్ బాబు దూసుకెళుతున్నారు. 'స‌ర్కారు వారి పాట' సినిమా రిలీజ్ అయ్యాక.. ఈ సినిమా మొద‌టి వారం క‌లెక్ష‌న్ రూ.175 కోట్లు దాటింది. బ్యాంక్ రుణాల నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమాలో మంచి సోష‌ల్ మెసేజ్ ఉంది. సుప్రీం కోర్టులో కూడా 'స‌ర్కారు వారి పాట' సినిమా ప్ర‌స్తావ‌న రావాలని కొందరు అంటున్నారు అంటే.. ఏ రేంజ్‌లో సినిమాలో హిట్ అయ్యిందో అర్థమవుతుంది.  

Sarakaruvari Paata: స‌ర్కారు వారి పాట సినిమాకు త‌మ‌న్ సంగీతం అద్భుతంగా ఉంది. అనంత శ్రీరామ్ క‌ళావతి, పెన్నీ, స‌ర్కారు వారి పాట‌, మ‌హేశా పాటల రిలిక్స్ మోత మోగుతున్నాయి. మ్యూజిక‌ల్ హిట్‌గా స‌ర్కారు వారి పాట సినిమా బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచింది. మ‌హేష్ డైలాగులు థియేట‌ర్ల‌ను ద‌ద్ద‌రిలిస్తున్నాయి. ఏపీ తెలంగాణల‌లో రూ. 96. 50 కోట్లకు ఈ సినిమాను సేల్ చేశారు. కర్నాటకలో రూ. 8.50 కోట్లకు, మిగ‌తా రాష్ట్రాల్లో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట‌ర్లు కొన్నారు. మొత్తంగా 120 కోట్ల రూపాయ‌ల బిజినెస్ చేసింది. ఎఫ్3 సినిమా  మే 27 న రిలీజ్ కానుంది. అప్ప‌టి వ‌ర‌కు స‌ర్కారు వారి పాట బిజినెస్ అనుకున్న దాని క‌న్నా ఎక్క‌వే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

You May Also Like These