Advertisement

ఎయిర్ పోర్టులో అభిమానుల కేరింతల మధ్య విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) .. అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ యువతలో ఒక మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు. ఈ సినిమా హిట్ అయ్యాక గీత గోవిందం, ట్యాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్, నోటా, ఏ మంత్రం వేసావె, డియర్ కామ్రేడ్ మొదలైన చిత్రాలలో ఈయన నటించారు. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ (Liger) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదే చిత్రంలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా ఓ పాత్ర పోషించడం విశేషం. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే విజయ్, 2019 లో దేవరకొండ ఫౌండేషన్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కూడా స్థాపించారు. అలాగే రౌడీస్ పేరుతో ఒక ఫ్యాషన్ బ్రాండ్ కూడా నెలకొల్పారు. 

లైగర్ సినిమా తర్వాత, మళ్లీ పూరీ జగన్నాథ్‌తోనే ఓ సినిమా చేయడానికి సంకల్పించారు విజయ్ దేవరకొండ. ఆగస్టు 2023 లో ఈ చిత్రం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రస్తుతం జొమాటోకి విజయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. 

ఇటీవలే విజయ్ దేవరకొండ, ఎయిర్ పోర్టులో ఫోటోగ్రాఫర్ల కళ్ళకు ఇలా చిక్కారు. 

Credits: PINKVILLA
Advertisement
You May Also Like These
Advertisement