రాజమౌళి(S. S. Rajamouli) దర్శక ధీరుడని అందరికీ తెలుసు. సినిమా ప్రమోషన్లలో కూడా వీరుడని మరోసారి రాజమౌళి నిరూపించుకున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ఆర్.ఆర్.ఆర్. సినిమా తీసి బాక్పాఫీసులు బద్దలు కొట్టారు రాజమౌళి. వేయి కోట్ల రూపాయల మార్క్ దాటిన సినిమాగా ఆర్.ఆర్.ఆర్. రికార్డు సాధించింది. అయినా సినిమా పాటలతో అప్‌డేట్స్ ఇస్తూ ఆర్.ఆర్.ఆర్ సినిమాపై ఇంట్రస్ట్ పెంచుతున్నారు.
సినిమా ప్రమోషన్లను రాజమౌళి చేసినంతగా ఎవరూ చేయలేరని అందరూ అంటుంటారు. అలాగే రాజమౌళి కూడా సినిమా రిలీజ్‌కు తర్వాత కూడా ప్రమోషన్ల దూకుడును మరింత పెంచుతారు. ఆర్.ఆర్.ఆర్. సినిమా రిలీజ్ తర్వాత ఆ సినిమాలోని పాటలను సరికొత్తగా రిలీజ్ చేస్తున్నారు. ఆర్.ఆర్ఆర్. నుంచి దోస్తీ, నాటు నాటు, కొమ్మ ఉయ్యాల పాటలు రిలీజ్ చేశారు. ఎత్తర జెండా పాటలో రాజమౌళి డాన్సుతో తనలోని దేశభక్తి చూపించారు.
రౌద్రం రణం రుధిరం సినిమాలో కొమరం భీముడో పాటకు ఆడియన్స్ జై కొట్టారు. ఇప్పుడు ఆ పాటను సరికొత్తగా రిలీజ్ చేయనున్నారు రాజమౌళి. మే 6 సాయంత్రం 4 గంటలకు కొమరం భీముడిని యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రణం రాఘవం పాటను కూడా అప్‌డేట్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
ఆర్.ఆర్.ఆర్. ప్రపంచ వ్యాప్తంగా వేయి కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. భారతదేశంలో ఓ గొప్ప సినిమాగా రికార్డు సాధించింది. సినిమాల రాజసం ఏంటో చూసిస్తున్న రాజమౌళి(S. S. Rajamouli) ఇంకా ఎలాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తారో.. ఎన్నెన్ని రికార్డులు సాధిస్తారో...
Follow Us