మేకప్‌ లేకుండానే ఫోటోలు.. సోషల్ మీడియా పోస్టులతో ఇన్‌స్పైర్ చేస్తానంటున్న హీరోయిన్ అదా శర్మ (Adah Sharma)

Updated on Jul 24, 2022 05:36 PM IST
యోగా, జిమ్‌ చేస్తున్న హీరోయిన్ అదా శర్మ (Adah Sharma)
యోగా, జిమ్‌ చేస్తున్న హీరోయిన్ అదా శర్మ (Adah Sharma)

నితిన్ హీరోగా తెరకెక్కిన హార్ట్‌ అటాక్‌, అడివి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన క్షణం, రాజశేఖర్‌‌ హీరోగా నటించిన కల్కి సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ అదా శర్మ (Adah Sharma). 1920 అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ జిమ్నాస్ట్‌కు సౌత్‌ ప్రేక్షకుల అభిమానం కూడా దక్కింది. మంచి డ్యాన్సర్, షూటర్ అయిన అదా శర్మ.. రొటీన్‌ వర్కవుట్స్, డైట్‌ గురించి అభిమానులతో పలు విషయాలు పంచుకున్నారు.

నిజానికి నేను సినిమా నేపథ్యం నుంచి రాలేదు. స్కూల్‌ డేస్‌ నుంచే పరిస్థితులను అర్థం చేసుకొని, సందర్భానికి తగినట్టుగా నడుచుకోవడం అలవాటు. క్లాస్‌లో తెలివైన స్టూడెంట్‌నే. కాలేజీలో చదితే రోజుల్లో మిమిక్రీ చేసే దాన్ని. అందరితో తొందరగా కలిసిపోయే మనస్తత్వం కారణంగానే సినిమాల్లో నిలదొక్కుకున్నాని ఉండొచ్చు.

జిమ్‌లో కసరత్తులు చేస్తున్న అదా శర్మ (Adah Sharma)

మేకప్‌ లేకుండానే ఇన్‌స్టా ఫోటోలు..

దేవుడిచ్చిన అందం, చర్మ సౌందర్యం ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోలకు మేకప్‌తో పోజులివ్వను. నా హెయిర్‌ కూడా నేచురల్‌గా వదిలేయడమే ఇష్టం. నేను కథక్‌ డ్యాన్సర్‌ను. అందులోనే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశా. ఏ స్టెప్‌ అయినా అలవోకగా వేసేస్తాను. నా మొదటి తమిళ సినిమాలో ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్‌ చేసే అవకాశం వచ్చింది. అది నా అదృష్టం. ఆ సమయంలో రోజూ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేదాన్ని. వార్మప్‌ కోసం సూర్య నమస్కారాలు చేస్తుంటాను. జిమ్నాస్టిక్స్‌ చేస్తాను గనుక యాక్షన్‌, స్టంట్స్‌ ఈజీ. కర్ర తిప్పటంలో నా స్టయిలే వేరుగా ఉంటుంది. 

వర్కవుట్స్‌ చేయకుంటే నిద్ర రాదు..

వర్కవుట్స్‌ చేయకుంటే నిద్ర పట్టదు. డైలీ వర్కవుట్స్‌ చేయకపోతే తోచదు. పూర్తి శాకాహారమే తింటుంటా. ఫ్లెక్సిబిలిటీ విషయంలో నా బాడీ పర్‌‌ఫెక్ట్‌గా ఉంటుంది. ఇన్‌స్టాతో పాటు సోషల్‌ మీడియాలో వర్కవుట్స్‌తో పాటు అవేర్‌నెస్‌ తేవడానికే స్టంట్స్‌ చేస్తా. డ్యాన్స్‌ వీడియోలతో ఇన్‌స్పైర్‌ చేస్తా. ఫిట్‌నెస్‌ ఉండాలని అందరికీ చెబుతుంటాను.

అదా శర్మ (Adah Sharma)

మైండ్‌కు సంబంధించినదే..

కొందరు సిక్స్‌ లేదా ఎయిట్‌ ప్యాక్‌ బాడీలను బిల్డప్‌ చేస్తారు. దానికి ముందు శారీరక దారుఢ్యం, ఫ్లెక్సిబిలిటీ మీద దృష్టి పెడితే బావుంటుంది అనిపిస్తుంది. నిజానికి ఫిట్‌నెస్‌ అనేది మైండ్‌కి సంబంధించిన విషయ. మెంటల్‌గా ఫిట్‌ అయితేనే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ఈజీ అవుతుంది. మెడిటేషన్‌, డ్యాన్స్‌, వర్కవుట్స్‌ నా జీవితంలో భాగం. మీరు ఫలానా తినండి.. ఇలా చేయండి అని ఎవరికీ సలహా ఇవ్వను. నేనైతే ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తినను. తాజా కూరగాయలు, పండ్లు తింటాను అని చెప్పారు అదా శర్మ (Adah Sharma). ఈ హాట్ బ్యూటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తిలోనూ నటించారు.

Read More : కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా షూటింగ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!