జెనీలియా (Genelia D'Souza)
సిద్దార్థ్ హీరోగా చేసిన ‘బొమ్మరిల్లు’ సినిమాలో ‘హ హా హాసిని’ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన బ్యూటీ జెనీలియా (Genelia D'Souza). ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్ముఖ్తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి పూర్తి టైం ఫ్యామిలీకే కేటాయిస్తోంది. ఫ్యామిలీ తో ఎంతా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. ఆమె చేసే వర్కవుట్స్ దగ్గరి నుంచి పర్సనల్ విషయాలన్నిటినీ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. కాగా, జెనీలియాను ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Photo Credit :
PINKVILLA
జెనీలియా (Genelia D'Souza)
ఇక, పెళ్లైన తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న ఈ భామ ఇపుడు వరుస సినిమాలతో అదరగొట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే త్వరలోనే తాను సినిమాలు చేయబోతున్నట్లు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం భర్త రితేష్ నటిస్తున్న సినిమాలకు నిర్మాతగా ఉన్న జెనిలియా (Genelia D'Souza) త్వరలోనే నటిగా మళ్లీ తెరపై కనిపించబోతోంది. ఇక జెనీలియా కథానాయికగా చేసిన చిత్రాల్లో సాంబ, ఆరెంజ్, సై, సుభాష్ చంద్రబోస్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఇటీవల ‘మా’ ఎలక్షన్స్‌లో తనకు మంచి ఫ్రెండ్ అయిన మంచు విష్ణుకి ఓటు వెయ్యడానికి హైదరాబాద్ వచ్చింది జెనీలియా. వీళ్లిద్దరూ కలిసి నటించగా సూపర్ హిట్ అయిన ‘ఢీ’ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న ‘D&D – Double Dose’ లో జెనీలియా నటించే అవకాశముందని తెలుస్తోంది.
Photo Credit :
PINKVILLA
జెనీలియా (Genelia D'Souza)
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటిని పరిచయం చేస్తూ సాయి కొర్రపాటి ఓ భారీ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల (Sree Leela) హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే హీరోను పరిచయం చేస్తూ టీజర్ కూడా విడుదల చేశారు.
Photo Credit :
PINKVILLA
జెనీలియా (Genelia D'Souza)
ఈ సినిమా ముహూర్తపు షాట్ కు దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే, ఆ కార్యక్రమానికి జెనీలియా (Genelia D'Souza) కూడా వచ్చింది. ఈ సినిమాలో ఆమె అత్యంత కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ఈమె భారీ పారితోషికం కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
Photo Credit :
PINKVILLA
Follow Us