రాశీఖన్నా (Raashi khanna)
టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా (Raashi khanna) గ్లామర్ పరంగా క్రమ క్రమంగా ఓపెన్ అవుతోంది. అందాల ఆరబోతలోనూ తాను ఇతర హీరోయిన్లతో తక్కువ కాదని నిరూపించుకుంటోంది. తాజాగా వర్కౌట్ డ్రెస్‌లో కనిపించి మతిపోగొడుతోంది. కాగా, బొద్దుగుమ్మ రాశీఖన్నా ముందు నుంచే వర్కౌట్స్ విషయంలో రాజీపడదు. బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు నిత్యం శ్రమిస్తుంది. సాధ్యమైనంత వరకు జిమ్‌లో గడుపుతూ ఉంటుంది ఈ బ్యూటీ.
Photo Credit :
Pinkvilla
రాశీఖన్నా (Raashi khanna)
సహజంగానే రాశీ అందం పిచ్చెక్కించేలా ఉంటుంది. అలాంటిది వర్కౌట్ డ్రెస్ లో చూస్తే, సహజమైన అందాలతో చూస్తే కుర్రాళ్లకి ఇక పండగే అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రాశీఖన్నా శుక్రవారం మార్నింగ్ వర్కౌట్‌లో భాగంగా (Raashi Khanna Workout Look) బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే ఆమె ఆరెంజ్ కలర్ టాప్, బ్లూ టైట్ ప్యాంట్ ధరించి జిమ్‌లో చెమటోడ్చింది. అనంతరం బయటకు వస్తుండగా కెమెరాలకు చిక్కింది.
Photo Credit :
Pinkvilla
హీరో కార్తికేయ (Hero Karthikeya)
టాలీవుడ్ లో 'ఆర్ఎక్స్ 100' (RX 100) సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. నటుడిగా వరుస అవకాశాలు అందుకుంటున్న హీరో కార్తికేయ. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గానూ ఈయన రప్ఫాడిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ హీరోకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఏకంగా కోలీవుడ్ హీరో అజిత్ లాంటి స్టార్ హీరో సినిమాల్లో సైతం కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు.
Photo Credit :
Pinkvilla
హీరో కార్తికేయ (Hero Karthikeya)
ఇక, ఇటీవలే ఈ హీరో కార్తికేయ (Hero Karthikeya) ఓ ఇంటి వాడయిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు లోహిత రెడ్డిని వివాహమాడాడు. తాను నటించిన రాజా విక్రమార్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో లోహితకు అందరి ముందు ప్రపోజ్ చేశాడు కార్తికేయ. అంతకంటే ముందే తన ప్రేయసిని కార్తికేయ ప్రపంచానికి పరిచయం చేసాడు.
Photo Credit :
Pinkvilla
Follow Us