‘అల్లరి’ నరేష్ (Allari Naresh)
టాలీవుడ్ లో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో హాస్యాస్పద సినిమాలతో సినీ ప్రేక్షకులను అలరించిన నటుడు ‘అల్లరి’ నరేష్ (Allari Naresh). అన్ని రకాల భావోద్వేగాల్లో కామెడీని పండించడమే కష్టమన్న సంగతి తెలిసిందే. అలాంటి హాస్యాన్ని 50కి పైగా చిత్రాల్లో ప్రేక్షకులకు విజయవంతంగా అందించారు ఈ హీరో. యువ దర్శకులకు, నిర్మాతలకు కామెడీ జోనర్లో సినిమా చేయాలంటే మొదట గుర్తొచ్చేది ఆయన పేరే.
Photo Credit :
PINKVILLA
‘అల్లరి’ నరేష్ (Allari Naresh)
పక్కాగా సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తుంటాడు. అంతలా ఈయన తన నటన, కామెడీ టైమింగ్‌తో రెండు గంటలు హాయిగా నవ్వుకునేలా చేస్తాడు. అయితే, ఈ హీరో నవ్వులతోనే కాదు ‘నేను’, ‘ప్రాణం’, ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘నాంది’ వంటి ఎమోషనల్ చిత్రాల్లోనూ మెప్పించారు. 2002లో ‘అల్లరి’ చిత్రంతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం నేటికి 20 ఏళ్లకు చేరుకుంది.
Photo Credit :
PINKVILLA
‘అల్లరి’ నరేష్ (Allari Naresh)
నటుడు చలపతి రావు అబ్బాయి రవిబాబు దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో ‘అల్లరి’ సినిమాను ప్లాన్ చేశారు. ఓ రోజు ఫోన్ చేసి ఉన్నపళంగా రామానాయుడు స్టూడియోకి వచ్చేయ్ అన్నారు. తీరా వచ్చా నువ్వే ఈ సినిమాలో హీరో అనేసరికి నమ్మలేకపోయానంటూ చెప్పుకొచ్చాడు (Allari Naresh) అల్లరి నరేష్. అలా నా మొదటి సినిమానే.. నా ఇంటిపేరుగా మారిపోయిందని అన్నాడు.
Photo Credit :
PINKVILLA
‘అల్లరి’ నరేష్ (Allari Naresh)
అయితే.. హీరోగా నటిస్తున్న మొదట్లో ఓ ఐదు సినిమాల్లోనైనా అవకాశం వస్తుందా అని అనిపించేంది. కానీ, 57 చిత్రాల్లో నటించి, 20 ఏళ్లు ఇండస్ట్రీలో కొనసాగడం నిజంగా ఆనందంగా ఉంది... అప్పుడే 20 ఏళ్లు గడిచాయా అన్నట్లు ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
Photo Credit :
PINKVILLA
‘అల్లరి’ నరేష్ (Allari Naresh)
ఇదిలా ఉంటే.. నరేష్ (Allari Naresh) ప్రధాన పాత్రలో తాజాగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమాను చేస్తున్నాడు. రాజ్‌మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను గత నెలలో మేకర్స్ ఫిక్స్ చేశారు. టైటిల్ పోస్టర్‌తోనే ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొల్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది.
Photo Credit :
PINKVILLA
Follow Us