ప్రతీ ఒక్కరినీ గౌరవించడం అతని వ్యక్తిత్వం. ఆప్యాయతతో ఎదుటివారిని పలకరిస్తారు. ప్రేమతో మాట్లాడతారు. ఓ నటుడు ఎలా ఉండాలో అలానే ఉంటారు. స్నేహానికి ఎంతో గౌరవం ఇస్తారు. నవరసాలు పండించడమే కాదు.. పంచుతాడు ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు.
టాలెంట్‌తో ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరో అయ్యారు. తాతకు తగ్గ మనువడు అంటే జూనియర్ ఎన్టీఆరే. బాలరామాయణం నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు ఎన్నో పాత్రల్లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు. తెలుగు ప్రేక్షకులతో పాటు, ప్రపంచ స్థాయి అభిమానులను సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఎన్టీఆర్ 39వ పుట్టిన రోజు సందర్భంగా పింక్ విల్లా శుభాకాంక్షలు తెలుపుతోంది.
ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో, పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. మహేష్ బాబు, రాజమౌళి, రామ్ చరణ్, సుధీర్ బాబు, నందమూరి కళ్యాణ్ రామ్ వంటి తెలుగు సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్, ఆలియా భట్ వంటి స్టార్స్ ఎన్టీఆర్‌కు విషెస్ తెలుపుతున్నారు.
అలాగే ఫ్యాన్స్ నిర్వహించే ఎన్టీఆర్ పుట్టిన రోజు సంబరాలు అంబరాన్ని అంటాయి. పలు చోట్ల కేక్ కటింగులు చేశారు. సేవా కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద పెద్ద కటౌటులు ఏర్పాటు చేసి, ఎన్టీఆర్‌పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఊరు వాడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమాల్లోని క్యారెక్టర్లతో ఓ సీడిపీ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా యాప్‌లలో ఎన్టీఆర్ ఫోటోలతో, శుభాకాంక్షలతో పోస్టులు పెడుతున్నారు.
ఇక ఎన్టీఆర్ చేయబోయే కొత్త సినిమా ప్రాజెక్టులపై అప్‌డేట్స్ ఫ్యాన్స్‌ను హుషారెత్తిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమాపై రిలీజ్ చేసిన వీడియో మైండ్ బ్లాక్ చేస్తోంది. అదిరిపోయే ఎన్టీఆర్ డైలాగులు కొరటాల సినిమాలో పేలాయి. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి దర్శక మాంత్రికుడు ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమాపై పెద్ద చర్చే నడుస్తుంది. ఇక ఎన్టీఆర్ 31 సినిమా అప్ డేట్స్, ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ రోజు రీవీల్ చేశారు నిర్మాతలు. మాస్ లుక్‌తో సీరియస్ యాక్షన్ సీన్‌లో ఎన్టీఆర్ మనకు ఇందులో కనిపిస్తారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఓ హై ఓల్టేజ్ పవర్‌తో ఉంటుందని టాక్.
సినిమా లైఫ్
సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ, షాలిని దంపతుల కొడుకు జూనియర్ ఎన్టీఆర్. తల్లి షాలిని చిన్నతనంలోనే ఎన్టీఆర్‌కు కూచిపూడి నాట్యం నేర్చించి.. అనేక ప్రదర్శనలు ఇప్పించారు. కూచిపూడి నాట్యంలో ఎన్టీఆర్ ప్రదర్శనలను చూసిన వారంతా, తాతకు తగ్గ మనవడంటూ ప్రశంసించేవారు.
సీనియర్ ఎన్టీఆర్ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలో తన మనవడిని బాల నటుడిగా పరిచయం చేశారు. ఆ తర్వాత బాల రామాయణంలో రాముడిగా ఎన్టీఆర్ అద్భుత నటనను ప్రదర్శించారు. నంది అవార్డులలో ఎన్టీఆర్ 'బాలరామాయణం' సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. మొదటి సినిమాతోనే 'నంది అవార్డు' సాధించిన ఎన్టీఆర్.. నటనలో పరిపూర్ణతను చూపించే పాత్రలతో ముందుకు సాగుతున్నారు.
రామోజీరావు నిర్మించిన 'నిన్ను చూడాలని' సినిమాతో, ఎన్టీఆర్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి దర్వకత్వంలో వచ్చిన 'స్టూడెంట్ నంబర్ 1' సినిమాతో మంచి హిట్ కొట్టారు. వివి వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఆది'తో బాక్సాఫీస్ షేక్ చేశారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా 'సింహాద్రి'తో టాప్ హీరోగా మారారు.
రాఖీ, టెంపర్, ఆంధ్రావాలా, అదుర్స్, యమదొంగ, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత, ఆర్.ఆర్.ఆర్. సినిమాలతో, తన నటనా జీవితంలో ముందుకు సాగారు ఎన్టీఆర్. కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే.. మరికొన్ని ఫ్లాపులుగా మిగిలాయి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత.. ఓ ఐదారు చిత్రాలు చేసిన తర్వాత.. ఎన్టీఆర్ కాస్త బొద్దుగా మారారు. తన వెయిట్ సినిమాల్లో మైనస్ అనుకున్న ఎన్టీఆర్, ఆ తర్వాత ఎంతో కష్టపడ్డారు. ఆ తర్వాత, సిక్స్ ప్యాక్‌తో అదిరిపోయే లుక్‌లో సినిమాలు చేశారు. ఇక RRR సినిమాలో కొమురం భీముడుగా తన నట విశ్వరూపం చూపారు జూనియర్ ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ఫ్యామిలీ
2011లో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అభయ్‌రామ్, భార్గవ్ రామ్ అంటూ తాతగారి పేరు కలిసొచ్చేలా.. ఎన్టీఆర్ తన కుమారులకు పేర్లు పెట్టారు. తల్లి షాలిని, భార్య, పిల్లలతో ఎన్టీఆర్ ఎంతో సరదాగా ఉంటారు. ఎన్టీఆర్ అప్పుడప్పుడు వంట కూడా చేస్తారు. వెజ్, నాన్ వెజ్, రోటి పచ్చడి, బిర్యానీలు.. ఇలా ఎలాంటి వంటైనా టేస్టీగా చేసేస్తారు.
Follow Us