ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్ చాలు.. వాళ్లు నా బెస్ట్‌ ఫ్రెండ్‌ పిల్లలంటూ పూనమ్‌కౌర్‌‌ (Poonam Kaur) క్లారిటీ

Updated on May 05, 2022 02:59 PM IST
సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన పూనమ్‌కౌర్‌‌ (Poonam Kaur)  ఫోటో
సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన పూనమ్‌కౌర్‌‌ (Poonam Kaur) ఫోటో

హీరోయిన్‌ పూనమ్‌కౌర్ (Poonam Kaur).. ఆఫర్లు లేక చాన్నాళ్లుగా టాలీవుడ్‌కు దూరమైంది. అయితేనేం.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది ఈ భామ. ఆమె గురించి ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. పూనమ్‌ కౌర్‌‌ చేసే ట్వీట్లు, పెట్టే స్టేటస్‌లు అన్నీ దాదాపుగా వైరల్ అవుతూనే ఉంటాయి.

ఇటీవల పూనమ్‌ కౌర్‌‌ పెట్టిన ఫోటో కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అభిమానులు, నెటిజన్లు దానిపై విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ కామెంట్లకు చెక్‌ పెట్టాలని పూనమ్‌ డిసైడ్‌ అయ్యింది. ఆ ఫోటోపై క్లారిటీ ఇచ్చింది.

ఇటీవల పూనమ్‌ కౌర్‌‌ ఇద్దరు చిన్న పిల్లలతో ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌‌ చేసింది. ఆ పిక్‌ విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేనా.. పూనమ్‌ కౌర్‌‌కు పెళ్లి అయ్యిందని, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వార్తలు వచ్చేశాయి. ఆ ఫోటోతోపాటు ఆ వార్త కూడా వైరల్ కావడంతో.. పూనమ్‌ క్లారిటీ ఇచ్చింది.

‘‘ఇప్పటివరకు నాకు జరిగిన డ్యామేజ్‌ చాలు. వాళ్లు నా బెస్ట్ ఫ్రెండ్‌ పిల్లలు. సోషల్‌ మీడియాకు ధన్యవాదాలు. నేను దీనికి క్లారిటీ ఇవ్వగలను. నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి.. బతకనివ్వండి” అని పూనమ్‌కౌర్ (Poonam Kaur) ట్వీట్ చేసింది.

హైదరాబాద్‌లో పుట్టిన పూనమ్‌ కౌర్‌‌ 2005లో మిస్ ఆంధ్రా టైటిల్‌ గెలుచుకుంది. అనంతరం 2006లో ఎస్వీ కృష్ణరెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 20008లో గోపీచంద్‌ హీరోగా వచ్చిన శౌర్యం, నాగార్జున హీరోగా వచ్చిన గగనం సినిమాల్లో నటనకుగాను ఉత్తమ సహ నటిగా ఫిల్మ్‌ఫేర్‌‌ అవార్డు అందుకుంది. 2016లో వచ్చిన నాయకి సినిమా తర్వాత పూనమ్‌కౌర్‌‌ టాలీవుడ్‌కు దూరమైంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!