'సీతారామం' సక్సెస్ మీట్ లో మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur in Sitaramam Success Meet)
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరో హీరోయిన్లుగా నటించిన 'సీతారామం' (SitaRamam) సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. 'అందాల రాక్షసి' ఫేం హనురాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా విడుదలైంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. హీరో సుమంత్ అక్కినేని కీలకపాత్రలలో నటించారు.
Photo Credit :
pinkvilla
'సీతారామం' సక్సెస్ మీట్ లో మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur in Sitaramam Success Meet)
'సీతా రామం' (Sitaramam) సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ లవ్‌స్టోరీని ఎంతో అందంగా చూపించడంలో హను రాఘవపూడి సక్సెస్ అయ్యాడని ప్రేక్షకులు తేల్చేశారు. ఇక, ఈ సినిమా ఊహించినదాని కంటే సూపర్ సక్సెస్ కావడంతో మేకర్స్ గురువారం (ఆగస్ట్ 11) సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Photo Credit :
pinkvilla
'సీతారామం' సక్సెస్ మీట్ లో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman in Sitaramam Success Meet)
ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ అక్కినేని నాగార్జునను (Akkineni Nagarjuna) చీఫ్ గెస్ట్ గా పిలిచి ఒక సక్సెస్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ వేదికపై నాగార్జున మాట్లాడుతూ దత్తు గారు కంటే నేను ఎక్కువగా ప్రేమించే వారు ఇద్దరు ఉన్నారు.. అందులో ముఖ్యంగా స్వప్న, ప్రియాంక చిన్నప్పటి నుంచి వాళ్లు నాకు తెలుసు వారిద్దరు అశ్వని దత్ గారికి ఎంతో అండగా ఉంటారని తెలిపారు.
Photo Credit :
pinkvilla
'సీతారామం' సక్సెస్ మీట్ లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ (Dulquer Salman, Mrunal Thakur in Sitaramam Success Meet)
'సీతారామం' సక్సెస్ మీట్ లో హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ఫుల్ బ్లాక్ డ్రెస్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించగా.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రింటెడ్ ఫ్లోరల్ లెహెంగాలో చాలా క్యూట్‌గా అనిపించింది.
Photo Credit :
pinkvilla
Follow Us