Aditi Shankar : డైరెక్టర్ శంకర్ కుమార్తె ఆదితి హీరోయిన్‌గా.. ఓ స్టార్ హీరోతో తెలుగు చిత్రం ప్రారంభం ?

Updated on Aug 05, 2022 06:43 PM IST
ఆదితి శంకర్ (Aditi Shankar) తెలుగులో కథానాయికగా పరిచయమవుతుందని ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఆదితి శంకర్ (Aditi Shankar) తెలుగులో కథానాయికగా పరిచయమవుతుందని ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

డైరెక్టర్ శంకర్  (Shankar).. అందరికీ బాగా సుపరిచితమైన పేరు. జెంటిల్‌మేన్, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, ఒకే ఒక్కడు, ఐ లాంటి సినిమాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే ఓ తిరుగులేని దర్శకుడిగా ఎదిగారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

ఇక మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. డైరెక్టర్ శంకర్ కూతురు కూడా ఓ తెలుగు సినిమాలో నటించడానికి సిద్ధమవుతుందట. శంకర్ కుమార్తె పేరు ఆదితి. ఆమె చాలా పెద్ద బ్యానర్‌లో.. ఓ పెద్ద స్టార్ హీరోతో సినిమా చేయనుందని ప్రస్తుతం ఓ టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

అయితే, ఈ అంశానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం కూడా బయటకు రాలేదు. కాకపోతే, ఆదితి (Aditi Shankar) కి సినిమాలలో నటించడం కొత్తేమీ కాదు. ఇటీవలే తమిళ హీరో కార్తి నటించిన 'వీరుమన్' చిత్రంలో ఆదితి కూడా నటించింది. అలాగే శివకార్తికేయన్ హీరోగా నటించిన 'మావీరన్' చిత్రంలో కూడా నటిస్తోంది. 

తెలుగు ఇండస్ట్రీకి మరో కొత్త కథానాయిక ?

అయితే ఆదితికి తెలుగు చిత్రాలలో నటించడం మాత్రం కొత్తనే చెప్పాలి. ఈ క్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త, టాలీవుడ్‌లో ఎన్నో చర్చలకు దారి తీస్తోంది. సాధారణంగా డైరెక్టర్ల కుమార్తెలు నటనా రంగంలోకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఈ క్రమంలో ఆదితి నటించబోయే చిత్రాల పై స్వతహాగానే అందరికీ ఆసక్తి మెండుగానే ఉంటుంది.  

ఇక శంకర్ (Shankar) విషయానికి వస్తే, ఆయన ఆర్‌సీ15 చిత్రంతో పాటు కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్ 2 చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ 2 చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో గతంలో శంకర్ ఎదుర్కొన్న వివాదం ఇటీవలే ఒక కొలిక్కి వచ్చింది. దీంతో ఆ చిత్రం కూడా త్వరగానే పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. 
 

Read More : జేమ్స్ బాండ్ పాత్ర‌కు రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) సెట్ అవుతారట! హాలీవుడ్ ప్రముఖుడి ప్రశంసల వెల్లువ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!