కాబోయే భర్తతో ఈఫిల్ టవర్ వద్ద హీరోయిన్ హన్సిక (Heroine Hansika With Her Fiance At Eiffel Tower)
కొన్నేళ్ల క్రితం దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఓ వెలుగువెలిగింది బొద్దుగుమ్మ హన్సిక (Hansika Motwani). టాలీవుడ్ లో అతిచిన్న వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో తెరకెక్కిన 'దేశముదురు' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది హన్సిక. ఈ సినిమా తో ఓవర్ నైట్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
Photo Credit :
Instagram
కాబోయే భర్తతో ఈఫిల్ టవర్ వద్ద హీరోయిన్ హన్సిక (Heroine Hansika With Her Fiance At Eiffel Tower)
'దేశముదురు' (Deshamuduru) తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎన్టీఆర్ తో కంత్రి, ప్రభాస్ తో బిల్లా, రామ్ తో కందిరీగ,మస్కా , రవితేజ తో పవర్ వంటి చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది హన్సిక. మరోవైపు తమిళంలో కూడా వరుస సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి స్టార్ డమ్ ని సంపాదించుకుంది. ఇక, జూనియర్ ఖుష్బూగా అక్కడి ప్రేక్షకులు హన్సిక ను భావించి ఆమెకు గుడి కూడా కట్టేశారు.
Photo Credit :
Instagram
కాబోయే భర్తతో ఈఫిల్ టవర్ వద్ద హీరోయిన్ హన్సిక (Heroine Hansika With Her Fiance At Eiffel Tower)
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హన్సిక (Hansika Motwani) గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పాలబుగ్గల బ్యూటీ హన్సిక త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హన్సిక వెల్లడించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న రాజస్థాన్, జైపూర్ ప్యాలెస్ లో హన్సిక పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
Photo Credit :
Instagram
కాబోయే భర్తతో ఈఫిల్ టవర్ వద్ద హీరోయిన్ హన్సిక (Heroine Hansika With Her Fiance At Eiffel Tower)
ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది హన్సిక (Hansika Motwani). తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్ కూతురియాను వివాహమాడబోతున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్తో అతనితో పారిస్ ఈఫిల్ టవర్ ముందు దిగిన ఫొటోలను షేర్ చేశారు. ‘ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా, ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి.
Photo Credit :
Instagram
కాబోయే భర్తతో ఈఫిల్ టవర్ వద్ద హీరోయిన్ హన్సిక (Heroine Hansika With Her Fiance At Eiffel Tower)
హన్సిక (Hansika Motwani) పెళ్లాడబోయే సోహైల్ కూతురియా ఓ ప్రముఖ వ్యాపారి. సొహైల్ సోదరి హన్సిక కు చిన్నప్పటి నుండీ బెస్ట్ ఫ్రెండ్ అట. రాజస్థాన్ లోని జైపూర్ ప్యాలెక్ లో హన్సిక పెళ్లి ఓ నాలుగు రోజులు పాటు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. మెహిందీ, సంగీత్, పెళ్లి కూతురు ఫంక్షన్స్ తో పాటుగా పెళ్లి కి సంబందించిన ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ పెళ్ళికి హన్సిక ఫ్యామిలీ, సోహైల్ కుటుంబ సభ్యులతో పాటుగా.. కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం.
Photo Credit :
Instagram
Follow Us