ఏపీ చరిత్రలో తొలిసారిగా మొబైల్ థియేటర్ ప్రారంభం.. ఆచార్య (Acharya) తో షోస్ మొదలు !

Andhra Pradesh's First Mobile Theatre established at Raja Nagaram

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో మొబైల్‌ థియేటర్‌ ప్రారంభమైంది. స్థానిక జీఎస్ఎల్ మెడికల్ కాలేజీకి దగ్గర్లో హెబిటేట్ రెస్టారెంట్ పక్కనే దీనిని ఏర్పాటు చేశారు. జీఎస్‌ఎల్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు చేతుల మీదుగా సోమవారం ఈ మొబైల్ థియేటర్ ప్రారంభమయింది. అన్నిరకాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దీనిని ఏర్పాటు చేశారు. 

ఇన్ ప్లాటబుల్ అకోస్టిక్ మెటీరియల్ తో తయారు చేసిన ఈ థియేటర్.. అగ్నిప్రమాదాలను సైతం తట్టుకుంటుంది. ‘పిక్చర్‌ టైమ్‌’ (Picture TIme) సంస్థ ఈ థియేటర్ ను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల వారికి ఐమాక్స్ థియేటర్ అనుభూతిని కల్పించేందుకు దీనిని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 

35 ఎంఎం స్క్రీన్.. 120 సీట్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్ కు ఏడాది పాటు ఏపీ ప్రభుత్వం అన్ని అనుమతులను ఇచ్చింది. ఇందులో సినిమా చూసేందుకు ఆన్ లైన్ తో పాటు.. ఆఫ్ లైన్ లోనూ టికెట్లు లభిస్తాయి. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య (Acharya) ఏప్రిల్ 29న విడుదల కాబోతున్న సందర్భంగా ఈ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటలోకి రానుంది. 

Credits: Instagram
You May Also Like These