మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఆచార్య(Acharya అనుకున్నంత హిట్ సాధించలేదు. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయాం ఆదుకోండంటూ ఆచార్య ప్రొడ్యూసర్లను కోరుతున్నారు. నష్టాలను పూడ్చేందుకు ఆచార్య ప్రొడ్యూసర్లు ఏం చేయనున్నారు.
ఆచార్య(Acharya సినిమా ఫ్లాఫ్ అవడంతో డిస్ట్రిబ్యూటర్లు బాగా నష్టపోయారు. తమను ఆదుకోవాలంటూ డిస్ట్రిబ్యూటర్లు చిరంజీవికి లేఖ రాశారు. ఆచార్య సినిమాకు ఏడాది క్రితమే అడ్వాన్స్ చెల్లించామన్నారు. ఆచార్య సినిమా విడుదలకు ముందు మొత్తం డబ్బు చెల్లించారు డిస్ట్రిబ్యూటర్లు. కరోనాతో నష్టాల్లో ఉన్న తమను ఆచార్య మరింత నష్టాల్లోకి నెట్టిందని చిరంజీవికి లేఖ రాశారు. అప్పులు తెచ్చి మరీ ఆచార్య చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేశామన్నారు. నష్టపోయిన తమను చిరంజీవి ఆదుకోవాలని వేడుకున్నారు. ఆచార్య నైజాం ఎగ్జిబిటర్ గా ఉన్న వరంగల్ శ్రీను దగ్గర నుండి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రాజ్ గోపాల్ బజాజ్ కొనుగోలు చేశారు.
చిరంజీవి తన భార్య సురేఖతో హాలీడే టూర్ కోసం విదేశాలకు వెళ్లారు. రామ్ చరణ్ కొత్త సినిమా షెడ్యూల్‌తో వైజాగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కోవిడ్ కారణంగా ఆచార్య సినిమా చాలా ఆలస్యమైంది. అధిక వడ్డీలు తెచ్చి మరీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు.
ఆచార్య(Acharya సినిమా వల్ల 75 శాతం నష్టపోయామని ఆదుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు లేఖలో చిరంజీవిని కోరారు. మరోవైపు ఆచార్య ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ మూవీస్‌లో ముందే విడుదల చేసి ఎక్కువ డబ్బులు రాబట్టాలని చూస్తున్నారు.
Follow Us