ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ (Nikki Galrani, Aadhi Pinishetty)
Aadhi Pinishetty: యువ కథానాయకుడు ఆది పినిశెట్టి ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో హీరోగా, నటుడిగా మెప్పించాడు.విభిన్న పాత్రలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన సినిమాలలో నటిస్తూ తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంటూనే ఇప్పుడు తన ప్రేమలో కూడా విజయం సాధించి అక్కడ కూడా సఫలం అయ్యాడు. మే 18న తాను ప్రేమించిన హీరోయిన్ నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు. రెండు రోజుల క్రితమే ఆది దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.
Photo Credit :
Pinkvilla
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ (Nikki Galrani, Aadhi Pinishetty)
ఈ క్రమంలో ఆది పినిశెట్టి, నిక్కీల పెళ్లికి సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆది పినిశెట్టి (Aadhi Pinishetty), భార్య నిక్కీ గల్రాని నుండి కట్నం ఏమైనా తీసుకున్నాడా? తీసుకుంటే ఎంత తీసుకున్నాడు? అనే చర్చలు ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాలలో కూడా జరుగుతున్నాయి.
Photo Credit :
Pinkvilla
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ (Nikki Galrani, Aadhi Pinishetty)
ఎంత లవ్ మ్యారేజ్ అయితే మాత్రం కట్నం తీసుకోకుండా ఎందుకుంటాడు? భారీగానే అందుకుని ఉంటాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లను ఆయన సన్నిహితులు తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) సన్నిహితులు ఈ వార్త వినగానే కొంత మంది ఈ విషయాన్నీ పూర్తిగా కొట్టిపారేసినట్టు తెలుస్తుంది. ఈయన పై వస్తున్న కామెంట్లను తోసిపుచ్చారట ఆయన సన్నిహితులు. ఈయన కట్న కానుకలకు వ్యతిరేకం అని. నిక్కీ కుటుంబం కట్నం ఇచ్చేందుకు రెడీగా ఉన్నా కూడా ఆది మాత్రం కట్నం తీసుకోవడానికి నిరాకరించినట్టు. కట్నం కింద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని ఆయన సన్నిహితులు చెప్పినట్టు టాక్.
Photo Credit :
Pinkvilla
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ (Nikki Galrani, Aadhi Pinishetty)
తాజా సమాచారం ప్రకారం.. నిక్కీ ఫ్యామిలీ ఆది ఎంత అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, తనకు తానూ ప్రేమించిన అమ్మాయి చాలని.. డబ్బులు, ఆస్తులు ముఖ్యం కాదని చెప్పి పెద్దలను ఒప్పించి పెళ్లాడాడట. ఈ విషయం తెలిసి నిక్కీ ఫ్యాన్స్ ఆదిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆది ‘ది వారియర్’ (The Warrier) సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.
Photo Credit :
Pinkvilla
Follow Us