ఎవరూ ఊహించని భారీ ధరకు.. ఆచార్య (Acharya) నైజాం రైట్స్ అమ్మకం

ఆచార్య (Acharya) షూటింగ్‌లో తన తల్లిదండ్రులతో రామ్ చరణ్

టాలీవుడ్ సినిమాల డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి నైజాం ఏరియా అనేది అత్యంత కీలకం. దిల్ రాజు (Dil Raju) లాంటి నిర్మాతలు సాధారణంగా ఈ ప్రాంతాలలో డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం పోటీ పడుతుంటారు. ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో ఈ పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే డబ్బు పెట్టే సత్తా ఉన్నా, పరిశ్రమతో ఉన్న లింక్స్, నిర్మాతలు, హీరోలతో ఉండే స్నేహం.. లాంటి అంశాలు కూడా డిస్ట్రిబ్యూటర్‌కు కలిసొస్తుంటాయి. దిల్ రాజు చాలా సంవత్సరాల బట్టి నైజాం పంపిణీ హక్కుల విషయంలో తిరుగులేని పాత్ర పోషించారు. 

ఈ మధ్యకాలంలో పలువురు చిన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా నైజాం పంపిణీ హక్కులను సొంతం చేసుకొనే విషయంలో, తీవ్రమైన పోటీని ఇస్తున్నారు. అలాంటి వారిలో వరంగల్ శ్రీను (Warangal Srinu) ఒకరు. రవితేజ నటించిన క్రాక్ సినిమాను పంపిణీ చేసిన ఆయన.. ఇప్పుడు ఆచార్య సినిమాను రూ.42 కోట్లకు కొనడం పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

అయితే వ్యాపార సూత్రాలను బట్టి ఆలోచిస్తే, ఏ నిర్మాతైనా ఎవరు ఎక్కువ డబ్బు చెల్లిస్తే.. వారికే సినిమాను అమ్ముతారన్నది లోకవిదితం. కానీ ఒకప్పుడు చిన్న సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన వరంగల్ శ్రీను.. ఇప్పుడు మెగాస్టార్ సినిమాను కొనడంతో, ఆయన పై అందరి దృష్టి మళ్లింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరంగల్ శ్రీను మాట్లాడుతూ "మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ఆచార్య (Acharya) సినిమాలో మంచి కథ ఉంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. చిరంజీవి గారిని చూసే నేను పరిశ్రమలోకి వచ్చాను. చిన్న సినిమాలతో కెరీర్ మొదలెట్టినా, ఇప్పుడు చాలా పెద్ద సినిమాను పంపిణీ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది" అన్నారు.  


 

Credits: Ram Charan Instagram Page
You May Also Like These