'ఆర్ఆర్ఆర్‌' (RRR) ను ఆస్కార్‌కు ఎందుకు నామినేట్ చేయ‌లేదు : నెటిజన్లు

Updated on Sep 21, 2022 05:21 PM IST
 'ఆర్ఆర్ఆర్' (RRR), 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' వంటి 13 చిత్రాల‌ను దాటుకుని, ‘ఛలే షో’  సినిమా ఆస్కార్ నామినేష‌న్‌కు ఎంపికైంది.
'ఆర్ఆర్ఆర్' (RRR), 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' వంటి 13 చిత్రాల‌ను దాటుకుని, ‘ఛలే షో’ సినిమా ఆస్కార్ నామినేష‌న్‌కు ఎంపికైంది.

ఆస్కార్ అవార్డుల సంద‌డి మొద‌లైంది. ఈ అవార్డులలో "బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్" విభాగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డుల‌ కోసం ఉత్తమ చిత్రాల‌ను తామే ఎంపిక చేసి, ఆయా ప్ర‌భుత్వాలు నామినేష‌న్స్‌కు పంపుతున్నాయి.

ఈ సందర్భంగా, భార‌త ప్ర‌భుత్వం గుజ‌రాతీ సినిమా ‘ఛలే షో’ను ఆస్కార్ నామినేష‌న్‌కు పంపుతున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే ఈ సారి ప్రభుత్వం నుండి పంపే నామినేషన్లలో తెలుగు సినిమా 'ఆర్ఆర్ఆర్' (RRR) , బాలీవుడ్‌ మూవీ ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ కూడా ఉంటాయని ప‌లువురు భావించారు. కానీ ఓ చిన్న సినిమాకు ఈ అవ‌కాశం ద‌క్కింది. 

‘ఛలే షో’ అనే చిత్రాన్ని కామెడీ డ్రామా కథతో దర్శకుడు పాల్ నళిన్ తెర‌కెక్కించారు. భవీన్‌ రబరి అనే చిన్నారి ఈ చిత్రంలో అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. 'ఆర్ఆర్ఆర్' (RRR), 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' వంటి 13 చిత్రాల‌ను దాటుకుని ఈ సినిమా ఆస్కార్ నామినేష‌న్‌కు ఎంపికైంది.

ఫిలిమ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ‘ఛలే షో’ చిత్రాన్ని ఆస్కార్ నామినేష‌న్‌కు పంపుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మొత్తం 17 మంది స‌భ్యులు ఏక‌గ్రీవంగా ఈ సినిమాని ఎంపిక చేశార‌ని తెలిపింది. 

 'ఆర్ఆర్ఆర్' (RRR), 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' వంటి 13 చిత్రాల‌ను దాటుకుని, ‘ఛలే షో’  సినిమా ఆస్కార్ నామినేష‌న్‌కు ఎంపికైంది.

నెటిజ‌న్ల అభిప్రాయం..

భార‌తీయ కథలను ప్రతిబింబించిన  'రౌద్రం, ర‌ణం, రుధిరం' (RRR), 'ది కశ్మీర్‌ ఫైల్స్' చిత్రాలు ఆస్కార్ నామినేష‌న్‌కు ఎంపిక కాక‌పోవ‌డం బాధాక‌ర‌మైన విష‌య‌మ‌ని కొందరు నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు. భార‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. ‘ఛలే షో’ సినిమా 1988లో వ‌చ్చిన ఆస్కార్ విన్నింగ్ సినిమా #cinemaparadiso లాంటిదే అని అంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి దేశభక్తిని ప్రతిబింబించే సినిమాను నామినేష‌న్‌కు పంప‌క‌పోవ‌డం సిగ్గుప‌డాల్సిన విష‌యం అంటూ, ఆ చిత్ర అభిమానులు సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తున్నారు.

 'ఆర్ఆర్ఆర్' (RRR), 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' వంటి 13 చిత్రాల‌ను దాటుకుని ‘ఛలే షో’  సినిమా ఆస్కార్ నామినేష‌న్‌కు ఎంపికైంది.

ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఇండియా ఆస్కార్ అవార్డును పొంద‌లేక‌పోతుంద‌ని భార‌తీయులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈసారి నామినేషన్‌కు అధికారికంగా పంపిన 'ఛ‌లే షో' సినిమా కూడా ఆస్కార్ గెలుపొందే అవ‌కాశం లేదంటున్నారు. అలాంట‌ప్పుడు ఎందుకు భార‌త ప్ర‌భుత్వం ఈ చిత్రాన్ని నామినేట్ చేసింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. భారతీయతను గురించి, దేశభక్తిని గురించి తెలిపే 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఆస్కార్‌కు నామినేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Read More: 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాకు ఆస్కార్ ఇవ్వాలంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!