Masooda OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మసూద’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Updated on Dec 15, 2022 03:22 PM IST
థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన ‘మసూద’ (Masooda) మూవీ.. ఓటీటీ ఆడియెన్స్‌ను థ్రిల్ చేయడానికి సిద్ధమవుతోంది 
థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన ‘మసూద’ (Masooda) మూవీ.. ఓటీటీ ఆడియెన్స్‌ను థ్రిల్ చేయడానికి సిద్ధమవుతోంది 

కొన్ని చిన్న సినిమాలు అనూహ్యంగా విజయాలు సాధిస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే ఇలాంటి చిత్రాల విషయంలో కంటెంట్ చాలా ముఖ్యం. పబ్లిసిటీ పెద్దగా చేయకపోయినా, స్టార్లు లేకున్నా సినిమా సక్సెస్ అవ్వాలంటే అంత సులువు కాదు. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు మేకర్స్. అయితే అందులో కొన్ని మూవీలే ఆదరణ పొందుతాయి.

బజ్ తెచ్చుకునే చిన్న సినిమాల విషయంలో ఆడియన్స్ కూడా ఆసక్తి కనబరుస్తుంటారు. అలా మంచి బజ్ తెచ్చుకున్న చిత్రం ‘మసూద’. ఇటీవల విడుదలైన ఈ మూవీ మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి సినిమాలను ఆదరిస్తారనే పేరున్న తెలుగు ప్రేక్షకులు ఈ మూవీనీ ఆదరించారు. థియేటర్లలోకి అడుగుపెట్టిన వారిని ‘మసూద’ మూవీ ఒక రేంజ్‌లో భయపెట్టింది.  

టేకింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా ప్రశంసలు అందుకున్న ‘మసూద’ (Masooda) మంచి వసూళ్లను సాధించింది. ‘మసూద’ ముఖాన్ని కూడా చూపించకుండా.. ప్రేతాత్మ అన్వేషణతో సాగే కథను దర్శకుడు సాయి కిరణ్ పకడ్బందీగా తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నారు. ఆలాంటి ‘మసూద’ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిసెంబర్ 21 నుంచి ‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఈ హారర్ మూవీని మిస్సయిన వారు ఇంకో వారం రోజులు ఆగితే చాలు ఓటీటీలో చూసేయొచ్చు. 

ఇకపోతే, ‘మసూద’ మూవీలో సీనియర్ నటి సంగీతతో పాటు తిరువీర్, కావ్య కళ్యాణ్ ముఖ్య పాత్రలు పోషించారు. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి విజయవంతమైన సినిమాల్ని నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా ‘మసూద’ను ప్రొడ్యూస్ చేశారు. ఇక ప్రశాంత్ ఆర్.విహారి ఈ మూవీకి బాణీలు సమకూర్చగా.. జెస్విన్ ప్రభు ఎడిటర్‌గా పనిచేశారు.

Read more: మహేష్‌ బాబు (Mahesh Babu) లగ్జరీ లైఫ్‌ గురించిన ఆసక్తికర విశేషాలు (సూపర్‌‌స్టార్ దగ్గరున్న టాప్‌-6 ఐటమ్స్)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!